JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER PAIRING WITH HEROINE DHANYA BALAKRISHNA IN HIS FIRST MOVIE CR
సుడిగాలి సుధీర్ పక్కన హీరోయిన్ ఈ పిల్లే... హాట్ బ్యూటీతో ‘జబర్దస్త్’ హీరో రొమాన్స్...
‘జబర్దస్’ కామెడీ షోతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. తనదైన కామెడీ టైమింగ్‌తో స్కిట్స్ చేసే సుడిగాలి సుధీర్... మంచి మేజిషియన్ కూడా. ‘జబర్దస్త్’తో పాటు ‘ఢీ జోడి’, ‘పోవే పోరా’ వంటి ప్రోగ్రామ్‌లో మంచి వ్యాఖ్యతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. చాలా సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించి, నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్... హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ, షియాజీ షిండే, పోసాని కృష్ణమురళి వంటి నటులు ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. శేఖర్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. శేఖర్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ కథా చిత్రంగా రూపొందుతోంది.
సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త వచ్చినప్పటి నుంచి ఆయన పక్కన ఎవ్వరు హీరోయిన్గా నటిస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
2/ 34
‘జబర్దస్త్’ జోడిగా పేరొందిన రష్మీ గౌతమ్ హీరోయిన్గా నటిస్తుందని భావించారంతా... అయితే సుడిగాలి సుధీర్ తొలి సినిమాలో హీరోయిన్ ఎవ్వరనేది తెలిసిపోయింది.
3/ 34
‘రాజుగారి గది’ సినిమాలో హీరోయిన్గా నటించిన ధన్యా బాలకృష్ణ... సుడిగాలి సుధీర్ పక్కన హీరోయిన్గా కనిపించబోతోంది.
4/ 34
సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాలోనే ఓ చిన్న పాత్రలో కనిపించిన ధన్యా బాలకృష్ణ... ‘నేను శైలజ’, ‘రన్ రాజా రన్’, ‘చిన్నదాన నీకోసం’, ‘భలే మంచిరోజు’ వంటి సినిమాల్లో కనిపించింది.
5/ 34
ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ కాంబో సినిమా... జూలై చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.
6/ 34
సోషల్ మీడియాలో క్యూట్ అండ్ గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకునే ధన్యా బాలకృష్ణ... కేరళలో పుట్టి పెరిగింది.