Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం..
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం..
Sudigali Sudheer: జబర్థస్త్ కామెడీ షో నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఈయనకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.
జబర్థస్త్ కామెడీ షో నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఈయనకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.
2/ 6
దాంతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.
3/ 6
అయితే ఈ రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి. తాజాగా మరో సినిమాకు ఈయన కమిట్ అయ్యాడు. సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కబోయే చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
4/ 6
'సాఫ్ట్వేర్ సుధీర్' దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ తొలివారం నుంచి ప్రారంభం కానుంది.
5/ 6
కరోనా ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని చెప్తున్నారు యూనిట్.
6/ 6
కమెడియన్ సప్తగిరి ఇందులో ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కాలింగ్ సహస్ర అనే మరో సినిమాకు కూడా సైన్ చేసాడు సుధీర్. ఇది హార్రర్ కామెడీగా వస్తుంది. మొత్తానికి అటు బుల్లితెర.. ఇటు వెండితెర రెండింట్లోనూ సత్తా చూపించడానికి సిద్ధమైపోతున్నాడు సుడిగాలి సుధీర్.