సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన అడుగు పెడితే చాలు బుల్లితెర షేక్ అయిపోతుంది. సుధీర్ ఉన్నచోట టిఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చేస్తుంటాయి.
2/ 6
అందుకే ఈటీవీలో సుధీర్ పర్మినెంట్ అయిపోయాడు. అక్కడే ఆస్థాన కమెడియన్ అయిపోయాడు. చాలా ఈవెంట్స్ కూడా కేవలం ఈయన ఇమేజ్‌పైనే ప్లాన్ చేసారు కూడా. అయితే ఇప్పటి వరకు ఈటీవీలోనే కనిపిస్తూ వచ్చాడు సుధీర్.
3/ 6
అక్కడే నార్మల్ సుధీర్ కాస్తా సుడిగాలి సుధీర్ అయిపోయాడు కూడా. మిగిలిన వాళ్లంతా ఛానెల్స్ మారుతున్నా కూడా సుధీర్ మాత్రం ఈటీవీ గూటి పక్షిలా ఉండిపోయాడు. అయితే ఇప్పుడు ఈయన కూడా పక్క చూపులు చూస్తున్నాడు.
4/ 6
తాజాగా సుధీర్ జీ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడే ఉండిపోవడానికి మాత్రం కాదు.. తన స్నేహితుడు ప్రదీప్ కోసం సరిగమప షోలో ఒక్కసారి అలా మెరిసాడంతే. అదే విషయాన్ని ఆడియన్స్‌కు కూడా చెప్పాడు ప్రదీప్.
5/ 6
తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.
6/ 6
ఇప్పుడు జీ తెలుగులో కూడా అలాగే చేయాలని చూస్తున్నారు. మొత్తానికి సుధీర్ ఇప్పుడు ఈటీవీతో పాటు జీ వాడు కూడా అయిపోయాడన్నమాట.