జబర్దస్త్ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కడున్న వాళ్లంతా బయట బాగా ఫేమస్. ఈ షోతో ఎంతో మంది యంగ్ కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా అనామకులుగా ఉన్న వాళ్లు చాలా మంది నటులు జబర్ధస్త్ షో పుణ్యమా అని స్టార్స్ అయ్యారు. డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా పేరు కూడా బాగానే తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో నరేష్ కూడా ఉంటాడు.
ఈయన్ని అంతా ముద్దుగా పొట్టి నరేష్ అని పిలుస్తుంటారు. డాన్సర్‌గా వచ్చిన ఈ కుర్రాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్ అయిపోయాడు. హైట్ తక్కువగా ఉన్నాడనే అవమానాలు పడినా.. ఇప్పుడు అదే హైట్ ఆయనకు అన్నం పెడుతుంది. ముఖ్యంగా తనదైన పంచ్ డైలాగులతో కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తుంటాడు నరేష్. స్క్రిప్ట్‌లో లేని పంచులు వేయడంలో మనోడు దిట్ట. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుంటుంది నరేష్.
కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ఇతర షోలు కూడా చేస్తుంటాడు నరేష్. అందులో భాగంగానే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మనోడు ఫుల్లుగా నవ్విస్తుంటాడు. తాజాగా ఈయన క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చాడు. అక్కడ ఈ బుడ్డోడు చేసిన అల్లరి మాములుగా లేదు. అంతమంది ఉన్నా కూడా కేవలం తనపైనే కెమెరాలు ఫోకస్ అయ్యేలా కుమ్మేసాడు నరేష్. మరీ ముఖ్యంగా యాంకర్ సుమపై పంచ్‌ల వర్షం కురిపించాడు. ఆమెకు ప్రపోజ్ కూడా చేసాడు.
అక్కడున్న మిగిలిన కంటెస్టెంట్స్‌తో ఆడుకున్నాడు. యాంకర్ సుమకు రోజా ఇచ్చి ప్రపోజ్ చేయడమే కాకుండా లవ్ చేస్తావా లేదా అంటూ అడిగేసాడు. పోరా జఫ్పా.. మా ఆయన చూస్తే నిన్ను ఇక్కడే పాతేసి.. నీ సమాధిపై రోజా పువ్వు పెడతాడు అంటూ సుమ చెప్పింది. అయితే మీరు లవ్ చేయకపోతే ఇక్కడ నుంచి దూకుతా అని బెదిరిస్తూనే కాలు జారి పడిపోయాడు నరేష్.