బుల్లితెరపై కొందరు కమెడియన్స్‌కు సూపర్ క్రేజ్ ఉంది. వాళ్లు తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిక్‌గా నవ్వులు కనిపిస్తాయి. అలాంటి కమెడియన్స్‌లో హైపర్ ఆది ముందుంటాడు. కాన్ టెంపరరీ ఇష్యూస్ తీసుకుని అదిరిపోయే కామెడీ చేయడంలో హైపర్ ఆది సిద్ధహస్తుడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. ఈ మధ్యే ఈయన్ని బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకొచ్చారు.
అంతమంది బుల్లితెర కమెడియన్స్ ఉన్నా కూడా వరసగా రెండో ఏడాది కూడా హైపర్ ఆదిని ఏరికోరి మరీ తీసుకొచ్చారు. స్టేజీపై కనిపించిన ప్రతీ నిమిషం అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఆది. పక్కనే నాగార్జున ఉన్నా కూడా అతడిని కూడా డామినేట్ చేసాడు హైపర్ ఆది. అతడు స్క్రీన్ పై కనిపించినంత సేపు నాగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే హైపర్ ఆది ప్రభావం అర్థం చేసుకోవచ్చు.