జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్‌తో ఆయన చేసే ట్రాక్స్ అదిరిపోతాయి. ప్రతీ ఎపిసోడ్లో కూడా అనసూయతో కచ్చితంగా డ్యూయెట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు ఆది. వీళ్ల కెమిస్ట్రీ కూడా అదిరిపోవడంతో దర్శకులు కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఈ మధ్య అయితే స్కిట్స్‌లో కూడా తీసుకొస్తున్నాడు.
అనసూయ లేకుండా ఏం చేయట్లేదుగా అన్నట్లు మారిపోయింది హైపర్ ఆది పరిస్థితి. అయితే ఒకప్పుడు ఉన్నంత పదునుగా ఇప్పుడు ఆది స్కిట్స్ ఉండటం లేదనే వాదన కూడా మొదలైంది. ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడని.. ముందులా పంచులు కూడా వేయడం లేదని అభిమానులు కూడా కామెంట్స్ పెడుతున్నారు.
జబర్దస్త్‌లో కొత్తగా వచ్చిన ఇమ్మాన్యుయేల్ అదిరిపోయే పంచులు వేస్తున్నాడని.. హైపర్ ఆదిలో మాత్రం జ్యూస్ తగ్గిపోయిందంటూ పచ్చిగానే కామెంట్ చేస్తున్నారు.
వీటిపై హైపర్ ఆది మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపించడం లేదు. ఎందుకంటే తనపై వచ్చిన విమర్శలను ఎప్పుడూ లైట్ తీసుకుంటాడు ఆది. అలా కెరీర్ మొదట్నుంచి కూడా అలవాటు చేసుకున్నాడు.
మరోసారి ఈయన రెచ్చిపోయాడు. తాజా స్కిట్స్‌లో అనసూయను టార్గెట్ చేస్తూ పంచుల వర్షం కురిపించాడు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్లో యాంకర్ అనసూయను దారుణంగా టార్గెట్ చేసాడు హైపర్ ఆది.
తన మనసులో ఉన్న మాటలన్నీ అలా బయటపెడతాడో లేదంటే నిజంగానే అక్కడ స్క్రిప్ట్ అలా ఉంటుందో తెలియదు కానీ దారుణమైన పంచులు వేస్తూ ఉంటాడు ఆది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మొన్న వారం చేసిన పుష్ప స్పూప్లో అనసూయను దారుణంగా అవమానించాడు ఆది. మనో గారు అంటూ.. నీయవ్వ తగ్గేదేలే అంటాడు. అంతలోనే రోజా, అనసూయలను మాత్రం కేవలం తగ్గేదేలే అంటూనే.. వాళ్లే అవ్వల్లా ఉన్నారు.. మళ్లీ అనడం ఎందుకు అంటూ కౌంటర్లు వేస్తాడు.
అనసూయను అయితే మామూలుగా ఆడుకోలేదు. పుష్ప సినిమాలో అనసూయ దాక్షాయణిగా నటించిన సంగతి తెలిసిందే. స్కిట్లో ఆ పాత్రను శాంతి స్వరూప్‌తో చేయించాడు ఆది. శాంతిని అడ్డుపెట్టి అనసూయతో ఆడుకున్నాడు. ఆమె పరువంతా తీసాడు ఆది. అనసూయ, శాంతి స్వరూప్ ఒకేలా ఉన్నారని.. దాక్షాయణిగా ఇద్దరూ ఒకేలా ఉన్నారంటూ ఆది కౌంటర్ వేస్తాడు.
ఇదంతా చూస్తూ నవ్వుతూ అలా ఉండిపోయింది అనసూయ. అంతటితో ఆగకుండా సినిమాలో అనసూయ కాబట్టి పీక కోసింది.. ఇక్కడ శాంతి స్వరూప్ కాబట్టి ఉప్పెనే అని మరో డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు. ఆ స్కిట్ అంతా అనసూయపై సెటైర్ల వర్షం కురిపించాడు ఆది. ఇలా హద్దులు దాటే కామెడీ వద్దంటూ గతంలోనే ఆదికి అనసూయ వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు కూడా బయటకి వచ్చాయి.
పుష్ప సినిమాలో పాత్రను నిజంగానే అక్కడ ఆడుకున్నాడు ఆది. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ హీరోను కూడా వదల్లేదుగా.. ఇలాంటి స్కిట్స్ చేస్తే కచ్చితంగా నీకు ఎప్పుడో ఓ రోజు మూడుతుంది ఆది అంటూ వాళ్లు వార్నింగ్ ఇస్తున్నారు. ఇదంతా కామెడీ కోసమే చేసానంటూ ఎన్నిసార్లు హైపర్ ఆది కవర్ చేసుకున్నా కూడా అందులో కొన్నిసార్లు అభిమానుల మనోభావాలు మాత్రం హర్ట్ అవుతున్నాయి.