జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఈయనకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. తనదైన పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు ఆది. అలాగే సినిమాల్లో కూడా సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈయన ఇంటిపై.. ఆస్తులపై వార్తలు వస్తుంటాయి. పైగా జబర్దస్త్ కామెడీ షోలో రెమ్యునరేషన్స్ కూడా చాలానే ఉన్నాయి.
ఒక్కొక్కరికీ లక్షల్లోనే పారితోషికాలు అందుతున్నాయి. మల్లెమాల సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా రెమ్యునరేషన్ ఇస్తుంది. మరోవైపు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా అదే కమెడియన్లతో శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మరికొన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అలా నెలకు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. వాళ్ల సంపాదన చిన్న సైజ్ హీరోల మాదిరే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.
ఏడాదికి కోట్లకు చేరిపోయింది వీళ్ళ సంపాదన. అందుకే సోషల్ మీడియాలోనూ హైపర్ ఆది ఆస్తులపై వార్తలు చాలానే వస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా వినాయక చవితి ఈవెంట్లో తన రియల్ లైఫ్‌పై ఓ డాన్స్ ప్రోగ్రామ్ చేసారు. అది చూసిన తర్వాత ఆది తన ఊరిలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. అక్కడ ఆయనకున్న ఆస్తుల గురించి కూడా ఓపెన్ అయ్యాడు. తను చదువుకునేప్పుడే చాలా ఖర్చులు అయ్యాయని.. అప్పట్లోనే 20 లక్షల అప్పు అయిందని గుర్తు చేసుకున్నాడు.
తాను చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేటప్పుడు తన తండ్రి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని మరీ తనకు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత హైపర్ ఆది అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసాడు ఈయన. అభి దయతో జబర్దస్త్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఆ తర్వాత మెల్లగా టీమ్ లీడర్ అయ్యాడు. ఈ రోజు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అప్పట్లో తమ అప్పులు కట్టడానికి ఉన్న మూడు ఎకరాలు అమ్మేసాడు వాళ్ల నాన్న.
తాను జబర్దస్త్‌కు వచ్చిన తర్వాత అదే ఊరిలో ఏకంగా 16 ఎకరాలు కొనేసాడు ఆది. దాంతో తన తండ్రికి పది వేళ్లకు పది ఉంగరాలు కూడా చేయించాడు ఆది. పొలం కొనడంతో పాటు మరిన్ని ఆస్తులు కూడా కొనేసాడు హైపర్ ఆది. హైదరాబాద్‌లోనూ ఈయనకు మంచి ఇల్లు ఉంది. దీనిపై గుట్టలు గుట్టలుగా వార్తలున్నాయి. హైపర్ ఆదికి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉందని.. ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చాలానే ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే అసలు నిజంగా ఆదికి ఎలాంటి ఇల్లు ఉంది.. అది ఇంద్రభవనంలా ఉంటుందా.. అన్ని కోట్ల ఆస్తులు నిజంగానే ఉన్నాయా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి సమాధానం ఈ మధ్యే వచ్చింది. హైపర్ ఆది టీంలోనే చేసే పరదేశి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఆయన తనకోసం ప్రత్యేకమైన యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. అందులో కొన్ని వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైపర్ ఆది హోమ్ టూర్ చేసాడు పరదేశి.
హైదరాబాద్‌లో ఉన్న హైపర్ ఆది ఇంటిని చూపించాడు. ఈ వీడియోలో తన ఇంటిని మొత్తం తిప్పి చూపించాడు ఆది. యూ ట్యూబ్‌లో వచ్చే వీడియోలకు సమాధానం చెప్పడానికి.. తనకు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉందని ప్రచారం చేస్తున్న వాళ్లకు ఈ వీడియోనే సాక్ష్యంగా నిలిచింది. హైదరాబాద్‌లో ఓ సొంత ఫ్లాట్ కొనుగోలు చేసాడు ఆది. అందులోనే ప్రస్తుతం ఉంటున్నాడు ఈయన.
తన ఇంట్లోని ప్రతీ వస్తువును చూపిస్తూ.. ఇదే తన కలల సౌధం అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. బాల్కనీలో కూర్చున్నపుడు తనకు అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయని.. అక్కడ కూర్చుని ఐడియాలు రాసుకుంటానని చెప్పాడు ఆది. అక్కడే స్క్రిప్టులు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఏదేమైనా ఒకప్పుడు చూసి నవ్వుకున్న వాళ్ళతోనే ఇప్పుడు నువ్వు హీరోవబ్బా అనిపించుకుంటున్నాడు హైపర్ ఆది.