ప్రస్తుతం సుడిగాలి సుధీర్ తర్వాత ఆ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఆది. చాలా మంది కంటే జూనియర్ అయినా కూడా.. తనదైన పంచులతో సీనియర్స్‌కు కూడా షాకిచ్చాడు హైపర్ ఆది. జబర్దస్త్ కామెడీ షోలో రేటింగ్స్‌లో ఆది స్కిట్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఆయన టీమ్ సభ్యులకు కూడా మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి పరిస్థితల్లో కూడా తన టీమ్ సభ్యులను వదిలిపెట్టడు ఆది.
హైపర్ ఆది స్కిట్లతోనే దొరబాబు, పరదేశి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య ఓ విషయంలో ఇద్దరూ పోలీసులకు దొరికిపోయినపుడు కూడా తన పూచికత్తుతోనే విడిపించాడు ఆది. వ్యభిచార గృహంలో దొరబాబు, పరదేశి పట్టుబడటంతో నెటిజన్లు వీళ్లిద్దరినీ తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. అప్పుడు కూడా వాళ్లిద్దరినీ సపోర్ట్ చేసాడు హైపర్ ఆది. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత తన స్కిట్స్‌లో స్థానం ఇచ్చాడు.
ఆ సంఘటన గురించి వరసగా పంచులు వేస్తూ ఇప్పటికీ నవ్విస్తుంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మైత్రీవనం సమీపంలో శ్రీనిక పేరుతో దొరబాబు టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. ఈ టిఫిన్ సెంటర్‌కు హైపర్ ఆది, జబర్దస్త్ కమెడియన్లు ప్రచారం చేశారు. వాళ్లు వచ్చి దొరబాబు టిఫిన్ సెంటర్ కోసం ప్రమోషన్ చేయడమే కాకుండా బిజినెస్ బాగా జరగడానికి అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు.