జబర్దస్త్ కమెడియన్లు ఏం చేసినా కూడా బాగా పాపులర్ అవుతుంటుంది. ఎందుకంటే బుల్లితెరపై వాళ్లకు ఉన్న పాపులారిటీ అలాంటిది మరి. అందుకే వాళ్లేం చేసినా వెంటనే వైరల్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా ఓ కమెడియన్ తన ప్రేమను చాటడమే కాదు.. ప్రేమించిన అమ్మాయిని కూడా పరిచయం చేసాడు. అతడే జబర్దస్త్ బాబు. అక్కడ ఎక్స్ప్రెషన్ కింగ్ అంటూ అంతా మనోడిని ఆట పట్టిస్తుంటారు. రోజా నుంచి అంతా ఈయనతో బాగానే ఆడుకుంటారు.
బాబు కూడా తనదైన టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనే ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు. ప్రేమించడమే కాదు.. మనసులో ఉన్న ప్రేమను తెలియజేయడం కూడా చాలా ముఖ్యం. కళ్లు చూడగానే ప్రేమలో పడిపోతాయి.. మనసులో నచ్చిన వాళ్ల కోసం గుడి కట్టుకుంటారు ప్రేమికులు. కానీ దాన్ని బయటికి చెప్పుకోలేక నరకయాతన పడుతుంటారు. కొందరు మాత్రం ధైర్యంగా మనసులో మాట బయటికి చెప్పేస్తుంటారు. 2022లో కూడా ఇప్పటికీ ప్రేమలేఖలు రాసే ప్రేమికులు ఉన్నారు.
అలాంటి ఓ లేఖ.. అది రాసిన ప్రేమికుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అది కూడా ఓ జబర్దస్త్ కమెడియన్ రాసింది కావడం విశేషం. రెండేళ్ల కిందే తను ప్రేమించిన అమ్మాయికి ప్రేమను తెలిపిన జబర్దస్త్ బాబు.. ఇప్పుడు ఆమెను పరిచయం చేసాడు. అందరి ముందుకు తన ప్రేయసిని తీసుకొచ్చాడు. మనసులో ఉన్న అమ్మాయిని తలుచుకుంటూ తన ప్రేమను అక్షరాలుగా మార్చేస్తూ అద్భుతమైన ప్రేమలేఖ రాసాడు ఈయన.
అయితే పేరు మాత్రం చెప్పకుండా ప్రేమ పిపాసి అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చాడు ఈయన. అయితే పేరు లేని ఈ ఆకాశ రామన్న ప్రేమలేఖలో చాలా ఫీల్ మాత్రం ఉంది. అమ్ము నాలో ఆగిపోతున్న ఊపిరికి ప్రాణం పోసావు.. నా మనసుకు చలనం వచ్చేలా చేసావు.. బాబు గారు అని నువ్వు పిలిచే పిలుపుతో నా మనసులో బాధంతా పోయింది.. నిన్ను అమ్మూ గారూ అని పిలిచినపుడల్లా అమూల్యమైన ఆనందం కలుగుతుంది.
నువ్వు నిండుగా మాట్లాడితే పండగలా అనిపిస్తుంది.. నువ్వు కోపంగా మాట్లాడితే శాపంగా అనిపిస్తుంది.. ఈ లోకంలో అమూల్యమైనది ఏదైనా ఉందంటే అది నా అమూల్య.. నిన్ను నేను వదులుకుంటే జీవితాంతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ చాలా ఫీల్‌తో రాసాడు ఈ లెటర్. అయితే ఇదెవరు ఎవరికి రాసారనేది తెలియదు కానీ దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మాత్రం బాబు.