ఏపీలో సినిమా ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏదో విధంగా వైరం రగులుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీ వర్గాలకు నచ్చడం లేదు. మొన్నటి వరకు సినిమా టికెట్లు.. థియేటర్స్.. అంటూ వీటి చుట్టూ తిరిగిన ఇష్యూ కాస్తా ఇప్పుడు నాటకాల వైపు వచ్చింది. ఈ మధ్యే ఏపీ సిఎం జగన్ చింతామణి నాటకంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నాటకాన్ని వెంటనే రద్దు చేయాలని.. ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నిషేధం విధించడంపై కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమకు జీవానాధారంగా ఉన్న చింతామణి నాటకంపై నిషేధం దారుణం అంటూ వాళ్లు కూడా వాపోతున్నారు. ఈ మేరకు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్లో తెలుగు తల్లి విగ్రహం వద్ద కళాకారులు నిరసన కూడా చేపట్టారు.
1920లో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు ఈ నాటకాన్ని రాశారని.. మొదటిసారి ఆ నాటకంలో కాళ్ళకూరి నారాయణ రావు గారు నటించారని అప్పారావు తెలిపారు. చింతామణి నాటకంపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమని.. దారుణం అని చెప్పారు అప్పారావు. ఈ నాటకంపై విధించిన నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన తెలిపారు.
ప్రభుత్వం సంఘీభావంతో కూడిన మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని పేర్కొన్నారు. కళాకారులను, కళలను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాను ఆకాంక్షిస్తున్నానని అప్పారావు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా అప్పారావు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇవి ప్రభుత్వం వరకు చేరుతాయా లేదా అనేది చూడాలి.