బుల్లితెరపై వర్ష గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ చేసేటప్పుడు ఈమె పెద్దగా పరిచయం లేదు కానీ జబర్దస్త్ కామెడీ షోకు వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా అక్కడ తన అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టినా కూడా ఇప్పుడు జబర్దస్త్ లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్లకు తానేం తక్కువ కాదన్నట్లు అదిరిపోయే గ్లామర్ షో చేస్తుంటుంది ఈ బ్యూటీ.
అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కూడా హాట్ షోతో మతులు చెడగొట్టడం ఈమె స్టైల్. జబర్దస్త్ కామెడీ షోతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది వర్ష. ముఖ్యంగా ఈమె ఇమ్మాన్యుయేల్‌తో చేసే కామెడీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వర్ష సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ఈయన పరిస్థితి ముందు కాస్త విషమంగానే ఉన్నా.. ఇప్పుడు పర్లేదు. ఆయన కోలుకుంటున్నాడంటూ వర్ష సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు తన సోదరుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను కూడా షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. సంక్రాంతి వేడుకలతో హాయిగా ఉన్న తమ కుటుంబానికి యాక్సిడెంట్ న్యూస్ షాక్‌లా మారిపోయిందంటూ చెప్పుకొచ్చింది వర్ష.
అంతేకాదు.. ఈ ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో అందరికీ ఓ విజ్ఞప్తి కూడా చేసింది వర్ష. ‘దయచేసి అందరినీ వేడుకుంటున్నాను. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వకుండా ఉంటారు.
ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది’ అని వర్ష రాసుకొచ్చింది. ఈమె చేసిన పోస్ట్ వైరల్ అయిపోయింది. మీ సోదరుడికి ఏమీ కాదు.. బాధ పడకండి అంటూ అంతా ఆమెకు ధైర్యం చెప్తున్నారు. అలాగే జబర్దస్త్ కుటుంబం నుంచి కూడా చాలా మంది వచ్చి వర్షను పరామర్శిస్తున్నారు. ఫోన్లోనే ధైర్యం చెప్తున్నారు. ఎలాంటి సాయం కావాలన్నా కూడా తామున్నామనే ధైర్యం వర్షకు ఇస్తున్నారు మిగిలిన కమెడియన్లు.