ఓ వైపు టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాలతో కూడా బిజీగా ఉంది అనసూయ భరద్వాజ్. అటూ ఇటూ రెండు చోట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతుంది జబర్దస్త్ యాంకర్. మరీ ముఖ్యంగా బుల్లితెరపై వరసగా షోలు చేసుకుంటూనే.. మరోవైపు సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ మెగా కంపౌండ్ నుంచే అనసూయకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. మెల్లమెల్లగా కేరాఫ్ మెగా కంపౌండ్ అయిపోతుంది ఈ టాప్ యాంకర్.
ఒకసారి మెగా కాంపౌండ్లోకి అడుగు పెడితే హీరోలందరూ అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకే దర్శకులైనా.. హీరోయిన్లు అయినా ఎప్పుడెప్పుడు మెగా కాంపౌండ్లోకి అడుగు పెడదామా అని వేచి చూస్తుంటారు. ఒక్క అవకాశం వస్తే చాలు వాళ్ళ కెరీర్ సెట్ అయిపోయినట్లే. మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే మెగా అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమాలో కూడా కాసేపు కనిపించింది. అందులో వరుణ్ తేజ్ ఓ హీరోగా నటించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటించింది అనసూయ. ఇందులో దాక్షాయణి పాత్రలో రప్ఫాడించింది. కనిపించేది కాసేపే అయినా కూడా.. ఉన్నంత వరకు అల్లాడించింది అనసూయ. రాయలసీమ యాసలో మాట్లాడే ప్రతినాయకి పాత్రలో అనసూయ నటించింది.
గాడ్ ఫాదర్లో పవర్ ఫుల్ పాత్ర కోసం అనసూయను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి తనకు ఎంత ఇష్టం అనేది సోషల్ మీడియాలో వివరించింది. ఆయనను చూడగానే ఒక రకమైన భక్తి, మర్యాద వస్తాయని.. అలాంటి అద్భుతమైన లెజెండరీ నటుడితో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.