Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు. Photo : Instagram
ఇక తాజాగా అలాంటిదే మరో పోస్ట్ చేశారు రష్మి.. నేను గోల్డీని నేను అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటాను నాకు కావలసింది హూమన్ ఇంకా ఆహారం. రష్మి గౌతమ్ నన్ను రక్షించారు, నా తోబుట్టువులందరూ చనిపోయారు, నేను మాత్రమే చెత్త నుండి బయటపడ్డాను. నేను ఎప్పటికీ ప్రేమించబడే మంచి ఇంటి కోసం చూస్తున్నాను. మీరు దీన్ని చదువుతున్నట్లయితే, దయచేసి ముందుకు వచ్చి నన్ను దత్తత తీసుకోండి లేదా ఈ పోస్ట్‌ను షేర్ చేయండి అంటూ ఓ పోస్ట్ చేశారు. అయితే ఇదంతా ఆమె ఓ కుక్క పిల్ల కోసం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram
ఇక ఇలాంటిదే మరో విషయంలో ఆ మధ్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించారు రష్మి. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు. Photo : Instagram
ఇక రష్మి ఓ వైపు ఈ టీవీలో వచ్చే జబర్దస్త్, ఢీ షోలకు యాంకరింగ్ చేస్తూనే.. నందు హీరోగా వస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే పేరు పెట్టింది చిత్రబృదం. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని ప్రవీణ్ పగడాల నిర్మించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నందుతో పాటు రష్మీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. Photo : Instagram
టీవీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్.. అడపా దడపా సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. గుంటూరు టాకీస్ చిత్రంలో నటించి భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కోన్న రష్మీ.. బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో తానేంటో నిరూపించుకోనుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ చిత్రంలో తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో నందూ పోతురాజు పాత్రలో కనిపించనున్నాడు. Photo : Instagram
రష్మీ నందు లవ్ ఇంట్రెస్ట్‌గా కనబడనుంది. ఈ సినిమాలో నందు పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇక రష్మీ విషయానికి వస్తే.. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోన్న ఈ హాట్ యాంకర్ చాలా రోజుల తర్వాత పెద్ద తెరపై కనిపించనుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి.. ఈ సినిమాలో ఎలా అలరించనుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Photo : Instagram