రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు. ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు Photo : Instagram
అది అలా ఉంటే రష్మికి మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇటీవల అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన సంఘటన తర్వాత కొందరు నెటిజన్స్ రష్మిని అడుగుతూ.. ఈ విషయంలో మీస్పందన ఏంటీ ప్రశ్నించగా.. ఈ ఘటన జరగడం చాలా విచారకరం అంటూ.. ఈ ఘటనలో ఆ బాలుడి తప్పేంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది. కుక్కల సంతాన ఉత్పత్తి నియంత్రణ, వ్యాక్సినేషన్, వాటికి సరైన వసతి కల్పించాలంటూ ట్వీట్ చేశారు. Photo : Instagram
అది అలా ఉంటు రష్మి తాజాగా డైరీ ప్రొడక్ట్స్‌కు సంబంధించినటువంటి ఒక ట్వీట్ చేశారు. దీంతో మరోసారి నెటిజన్స్ ట్రోలింగ్ కి గురయ్యారు.. తాను డైరీ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం పూర్తిగా మానేశానని తెలియజేశారు రష్మి. దీనికి స్పందిస్తూ ఓ నెటిజన్ మాత్రం ఇదేంటీ అంటూ రష్మి గతంలో ఓ ఐస్ క్రీమ్ పార్లర్‌ను ఓపెన్ చేసిన ఫోటోలను పంచుకున్నారు. Photo : Instagram
దీనికి రష్మి రిప్లే ఇస్తూ.. అవును గతంలో నాకు తెలియక నేను కొన్ని తప్పులు చేశాను. కానీ గత కొంతకాలంగా నేను పాలు తాగడం పాల ఉత్పత్తులను తినడం పూర్తిగా మానేశానని.. పాల ఉత్పత్తులు తినడంతో తనకు ఆస్నే వస్తుందని పేర్కోన్నారు. దీనికి తోడు పాలను తీయ్యడం కోసం ఆ మూడ జీవాలను ఎన్ని రకాలుగా హింసిస్తారో తెలుసని.. అందుకే పాల పదార్థాలను తీసుకోవడం మానేశానని తెలిపారు. Photo : Instagram
ఇక అది అలా ఉంటే రష్మి గౌతమ్‌కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భామకు బిగ్ బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గోనే ఛాన్స్ వచ్చిందని.. అయితే రెమ్యూనరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఈ సారి హోస్ట్‌గా రానా వస్తున్నట్లు తెలుస్తోంది. Photo : Instagram
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. Photo : Instagram
ఇక ఇదే విషయంలో తాజాగా ట్విట్టర్ వేదికగా రష్మి ఆ మధ్య స్పందించారు. బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించారు రష్మి. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు. Photo : Instagram
ఇక రష్మి ఓ వైపు ఈ టీవీలో వచ్చే జబర్దస్త్, ఢీ షోలకు యాంకరింగ్ చేస్తూనే.. నందు హీరోగా వస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే పేరు పెట్టింది చిత్రబృదం. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని ప్రవీణ్ పగడాల నిర్మించాడు.. ఈ సినిమాలో నందుతో పాటు రష్మీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నవంబర్ 4, 2022న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Instagram
టీవీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్.. అడపా దడపా సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. గుంటూరు టాకీస్ చిత్రంలో నటించి భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కోన్న రష్మీ.. బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో తానేంటో నిరూపించుకోనుందని అనుకున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్లో అలరించలేదు. Photo : Instagram