మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు కాదు.. ఈయన ఏకంగా 4 సినిమాలు చేస్తున్నాడు. మరో మూడు సినిమాలు కథలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి 7 సినిమాలతో చిరు బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తైపోయింది. ఫిబ్రవరి 4, 2022న విడుదల కానుంది ఈ చిత్రం. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మలయాళం బ్లాక్‌బస్టర్ లూసీఫర్ రీమేక్ ఇది. కేవలం 3 నెలల్లోనే గాడ్ ఫాదర్ సినిమా షూట్ పూర్తి చేయాలని చూస్తున్నాడు చిరు. ఈ సినిమాతో పాటే మరోటి కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు మెగాస్టార్. అదే భోళా శంకర్.
తమిళ బ్లాక్‌బస్టర్ వేదాళం సినిమాకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసాడు మెహర్. చాలా వేగంగా సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా భోళా శంకర్ తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లిగా నటిస్తుండటం గమనార్హం.
ఈ సినిమా కోసం 2 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుంది కీర్తి సురేష్. ఇందులో చిరంజీవి అభిమానులు కోరుకునే ప్రతీ ఒక్క కమర్షియల్ అంశాన్ని ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మెహర్ రమేష్. తన శక్తినంతా ఈ సినిమా కోసం వాడుతానంటూ ఇప్పటికే చెప్పాడు ఈ దర్శకుడు. కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేని మెహర్ రమేష్‌ను నమ్మి భోళా శంకర్ సినిమాను అతని చేతుల్లో పెట్టాడు చిరంజీవి.
అయితే ఈ సినిమాకు వెనక చిరు ఉంటాడనే విషయం అభిమానులకు తెలుసు. తమన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ బయటికి వచ్చింది. ఇందులో అదిరిపోయే మాస్ ఐటం సాంగ్ ఉంటుందని.. అందులో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ నటించబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు.
చిరుకు రష్మిని రిఫర్ చేసింది కూడా శేఖర్ మాస్టర్ అని తెలుస్తుంది. ఖైదీ నెం 150, ఆచార్య తర్వాత మూడోసారి చిరంజీవితో కొరియోగ్రఫీ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు శేఖర్ మాస్టర్. ఇదే పాటలో రష్మి గౌతమ్ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలు కానుంది. మరి చూడాలిక.. మెగాస్టార్‌తో జబర్దస్త్ బ్యూటీ డాన్సులు ఎలా ఉండబోతున్నాయో..?