అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది అలా ఉంటే.. అనసూయ ఇటీవల తానా ఉత్సవాల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ ఓ పండ్ల తోటలో తన ఫ్యామిలితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.