తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అనసూయ ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు బుల్లితెరతో పాటు మరోవైపు వెండితెరపై కూడా వరస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అటూ ఇటూ రెండు పడవల్లో విజయవంతంగా ప్రయాణం సాగిస్తుంది అను. ఈ క్రమంలోనే తమిళం నుంచి కూడా ఈమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది అనసూయ.
ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫ్లాష్ బ్యాక్’. ‘గుర్తుకొస్తున్నాయి’ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై P. రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డాన్ శ్యాండీ దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు. బలమైన ఎమోషన్స్‌తో కూడిన కథను నేటితరం ఆడియన్స్ కోరుకునే ఆసక్తికర సన్నివేశాలు జోడిస్తూ సినిమాను అత్యద్భుతంగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టైటిల్, ట్యాగ్ లైన్ క్రేజీగా పెట్టి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.
ఈ సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం కూడా సగటు ప్రేక్షకుడి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని, అన్ని వర్గాల ఆడియన్స్ కెనెక్ట్ అయ్యేలా ఈ మూవీ రూపొందించామని దర్శకనిర్మాతలు చెప్పారు. చిత్రంలో యంగ్ హీరోయిన్ రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తుండగా.. అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి రోల్స్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయి.
అనసూయ రోల్ హైలైట్ కానుందని, ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పారు. ఇక ఈ చిత్రానికి శ్యామ్ CS అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో అసెట్ అని అన్నారు. గత కొంతకాలంగా రిచ్ లొకేషన్స్‌లో షూటింగ్ జరిపిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ వేగంగా ఫినిష్ చేస్తోంది.