రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన ‘ఖిలాడి’ సినిమా ఫిబ్రవరి 11న విడుదలైంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. రవితేజ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే ఖిలాడి సినిమా ఎలా ఉన్నా.. అందులో గ్లామర్ షో మాత్రం ఏం తక్కువ లేదు. బికినీ ట్రీట్స్‌తో పాటు లిప్ లాక్ సీన్స్ బోనస్. 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా లిప్ లాక్ సీన్స్ చేసాడు రవితేజ.
ఇది నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. గతంలో రవితేజతో ‘వీర’ సినిమా చేసాడు రమేష్ వర్మ. 2011లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వాత ‘ఖిలాడి’ అంటూ వచ్చారు. ఈ సారి కూడా ఫలితం మారేలా కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాకు వచ్చిన టాక్ చూస్తుంటే మాత్రం మాస్ రాజా ఎంతవరకు దీన్ని నిలబెడతాడో ఆసక్తికరంగా మారింది.
సింపుల్‌గా చెప్పాలంటే.. ట్రైలర్లో సావిత్రిని చూపించిన దర్శకుడు రమేష్ వర్మ.. సినిమాలో మాత్రం సన్నీ లియోన్‌ను పరిచయం చేసాడు. అనసూయను ఇంత గ్లామరస్‌గా మరే సినిమాలోనూ చూడలేదు అంటే అతిశయోక్తి కాదేమో..? హీరోయిన్లతో పోటీ పడి మరీ 36 ఏళ్ళ వయసులోనే అదిరిపోయే గ్లామర్ షో చేసింది అను. ఇందులో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
ఇద్దరు భామలు స్కిన్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు. పోటీ పడి మరి బికినీ షోలు కూడా చేసారు. డింపుల్ అయితే రెండాకులు ఎక్కువే చదివింది. అయితే స్క్రీన్ మీద హీరోయిన్లు అంతగా రెచ్చిపోతున్నా.. అనసూయ కూడా వాళ్లను డామినేట్ చేయడానికి ప్రయత్నించింది. మునుపెన్నడూ లేని విధంగా అనసూయ ‘ఖిలాడి’లో క్లీవేజ్ షోలు, థైస్ షోలతో మతులు చెడగొట్టేసింది.
ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా ఈ స్థాయిలో గ్లామర్ షో చేయడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్లు కూడా కుళ్లుకునేలా రెచ్చిపోయింది అనసూయ భరద్వాజ్. ఆ మధ్య కాస్త లావుగా ఉన్నట్లు కనిపించిన ఈమె.. ఇప్పుడు మళ్లీ బరువు తగ్గిపోయింది. ‘ఖిలాడి’ సినిమా ఫలితం ఎలా వచ్చినా.. ఇకపై అనసూయకు ఈ తరహా కారెక్టర్స్ పెరగడం మాత్రం ఖాయం. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్‌తో పాటు పుష్ప 2లో కూడా నటిస్తుంది ఈ జబర్దస్త్ యాంకర్.