అది అలా ఉంటే యాంకర్ మంజూషకు జబర్దస్త్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న కామెడీ షో.. అయితే కొన్నాళ్ల నుంచి వరుసగా ఒకరి తర్వాత ఒకరు షో నుంచి వెళ్లిపోతున్నారు. మొదట నాగబాబు వెళ్లారు. ఇక ఆ తర్వాత చంద్ర, ధన్రాజ్, వేణు వెళ్లారు. ఇక అప్పటి నుంచి పాపులర్ కమెడియన్స్ జబర్దస్త్ను విడుస్తూనే ఉన్నారు. ఇటీవల సుడిగాలి సుధీర్ టీమ్ ఒదిలి వెళ్లిపోగా.. హైపర్ ఆది కూడా నిష్క్రమించారు. రోజా కూడా మినిస్టర్ అయ్యాక జబర్దస్త్ మానేశారు. ఇక తాజాగా యాంకర్ అనసూయ కూడా షోను వదిలిపోనున్నారు. Photo : Instagram
అయితే ఎవరైనా ఒక్కచోటనే ఉండరు.. ఎవరి కెరీర్స్ వారివి. ఈ నేపథ్యంలోనే ఒక్కరోక్కరుగా విడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ను విడిచి వెళ్లడంతో ఆమె స్థానంలో యాంకర్ మంజూషను తీసుకురానున్నారట టీమ్. యాంకర్ మంజూష ఇప్పటి వరకు సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఇక ఇప్పటి నుంచి జబర్దస్త్ షోలో తన మాటలతో అలరించనున్నారని తెలుస్తోంది. మల్లేమాల టీమ్ యాంకర్ మంజూషాకు మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Instagram