కేజీఎఫ్ సౌతిండియా సినిమాల్లోనే ఓ సంచలనం. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటించిన పాన్ ఇండియా ప్రాజెక్టు కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ ప్రాజెక్టు బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ..ఇప్పటికే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.1000 కోట్ల మార్కును దాటేసింది.
తన చుట్టూ బాలీవుడ్ స్టార్ హీరోలందరూ తిరగాలి..ఈ KGF సినిమాని కన్నడ హీరోతోనే తీస్తా అని శపధం చేసి యాష్ ని హీరో గా పెట్టి బాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని భూస్థాపితం చేసాడు ప్రశాంత్ నీల్..ప్రస్తుతం బాలీవుడ్ లో KGF చాప్టర్ 2 టాప్ 2 గా నిలిచింది..టాప్ 1 గా బాహుబలి పార్ట్ 2 నిలబడగా..టాప్ 3 గా #RRR సినిమా నిలిచింది..
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు, ఈ షూటింగ్ పనుల్లో ప్రశాంత్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రతి నెలా పదిహేను రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.