మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మౌత్ టాక్ వల్ల వాల్తేరు వీరయ్య మిగితా సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లను రాబడుతోంది.. (Photo Twitter)
చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. అందులోనే తమిళ సినిమా వేదాళం రీమేక్ భోళా శంకర్ కూడా ఉంది. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మరో కీలకపాత్రలో కనిపించనుంది. ఈ రీమేక్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఇటీవలే రెస్యూమ్ అయ్యింది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్’లో నడుస్తోంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడోచ్చని తెలుస్తోంది. ఈ సినిమా మొదట ఏప్రిల్ 14 విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్. . (Twitter/Photo)
కాగా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మేలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.. (Twitter/Photo)
ఇక వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలోను అదరగొడుతోంది. ఈ సినిమా అక్కడ రెండు మిలియన్ అమెరికన్ డాలర్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు సైరా, ఖైదీ నెంబర్ 150. Photo : Twitter
ఇక ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 96.46కోట్లు..(రూ. 165.45 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 89 కోట్లు రాబట్టాలి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 7.46 కోట్ల లాభాల్లోకి వచ్చి క్లీన్ హిట్‌గా నిలిచింది..ఇక అది అలా ఉంటే వాల్తేరు వీరయ్య చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్‌గా మారనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.. Photo : Twitter
అందులో భాగంగా ఈ చిత్రం అమెరికాలో మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు ఓ రేర్ ఫీట్‌ను కూడా సాధించింది. వాల్తేరు వీరయ్య నాన్ RRR రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి ఆదివారం అత్యధిక వసూళ్లు నమోదు చేసి రికార్డ్ సెట్ చేసింది. ఈ స్థానంలో మొదట ఆర్ ఆర్ ఆర్ ఉండగా దీని తర్వాత 3 లక్షల 55 వేల డాలర్లుకి పైగా వసూళ్లు చేసి నాన్ RRR రికార్డ్ క్రియేట్ చేసిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. Photo : Twitter
వాల్తేరు వీరయ్యలో రవితేజ మరో కీలకపాత్రలో కనిపించారు.. ఈ సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కేక పెట్టించారు.. తెలంగాణ యాసలో మాస్ మాహారాజా వావ్ అనిపించారు. రవితేజ ఇటీవల ధమాకా సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నసంగతి తెలిసిందే. ఆయనకు వాల్తేరు వీరయ్య రూపంలో మరో హిట్ పడింది.. Photo : Twitter
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..తెలంగాణ (నైజాం)లో .. రూ. 18 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో.. రూ. 15 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 10.2 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 6.50 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 6.50 కోట్లు.. గుంటూరు.. రూ. 7.50 కోట్లు.. కృష్ణ.. రూ. 5.6 కోట్లు.. నెల్లూరు..రూ. 3.2 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 72 కోట్లు.. కర్ణాటక .. రూ. 5 కోట్లు.. రెస్టాఫ్ భారత్.. రూ. 2 కోట్లు.. ఓవర్సీస్లో రూ. 9 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 89 కోట్లు రాబట్టాలి. (Twitter/Photo)
ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే అజిత్ ‘తెగింపు’ విడుదలై తెలుగులో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంలో విజయ్ ’వారిసు’ విడుదలై మంచి టాకే సొంతం చేసుకుంది. వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఇక లేటెస్ట్గా వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చూడాలి మరి ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా విజేతగా నిలవనుందో..
ఇక అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. 'నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి అవుతా' అంటూ సాగే ఈ పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. దాంతో పాటు కాసేటికి క్రితమే విడుదలైన నీకేమే అందం ఎక్కువ.. నాకేమో తొందరెక్కువ లిరికల్ సాంగ్‌ను 2మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. Photo : Twitter
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటంచారు. రవితేజ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇక చిరు మరో సినిమా గాడ్ ఫాదర్.. ఈ సినిమా కూడా మంచి అంచనాల నడుమ వచ్చింది. ఈసినిమా నైజాంలో 17.50 కోట్ల వాల్యూ బిజినెస్‌కు మొత్తంగా 12.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇలా వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయాయి Photo : Twitter
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన నటనతో వావ్ అనిపించారు. ఈ సినిమాలో నయన్, చిరంజీవి చెల్లిగా కనిపించారు. ఆమె గతంలో చిరంజీవ సరసన సైరాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. Photo : Twitter
చిరంజీవి మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి తాజాగా పక్కా కమర్షియల్ ప్రిరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యూవీ విక్కీ నాతో సినిమా చేయాలన్నారు. నేను వెంటనే ఓకే అన్నాను, మారుతి ఇక ఆ సినిమా మీద దృష్టి పెట్టు అన్నారు. అయితే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏ జోనర్లో ఉండనుంది. ఎలాంటి కథతో వస్తున్నారు అనే విషయంలో క్లారిటీ రానుంది. మారుతి పక్కా కమర్షియల్ సినిమా తర్వాత ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా తర్వాత ఇది ఉండోచ్చని అంటున్నారు. Photo : Twitter
చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.Photo : Twitter
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ఆచార్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. (Twitter/Photo)
‘ఆచార్య’ మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్‌లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. Photo : Twitter
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు నక్సల్స్ పాత్రల్లో కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది. Photo : Twitter
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 84 కోట్ల వరకు బయ్యర్స్‌కు నష్టాలను మిగిల్చింది. దీంతో తమ నెక్ట్స్ మూవీలతో వారిని ఆదుకుంటామని ఈ చిత్ర నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ బయ్యర్స్‌కు హామి ఇచ్చారు. Photo : Twitter