యాంకర్ సుమ కనకాల తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలాకైన మాటలతో గత 15 సంవత్సరాలుగా అలరిస్తున్నారు. అది అలా ఉంటే సుమ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పి షాక్ ఇచ్చారు. విషయంలోకి వస్తే.. ఇటీవల జరిగిన ఓ షోలో సుమ మాట్లాడుతూ.. తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ కొంతకాలం యాంకరింగ్‌కు విరామం ఇవ్వనున్నట్టు తెలుపుతూ సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. Photo : Instagram
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. ఈ విషయంలో యాంకర్ సుమ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై స్పందిస్తూ.. “న్యూ ఇయర్ స్పెషల్ గా ఓ ఈవెంట్ చేశాం. దీనికి సంబంధించిన ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. అయితే ఈవెంట్ పూర్తిగా చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నేను యాంకరింగ్ మానేయడం లేదని జస్ట్ ఆషోలో భాగంగా మాత్రమే అలా చేశానంటూ.. క్లారిటీ ఇచ్చారు. ఇక ఇది తెలుసుకున్న సుమ ఫ్యాన్స్ మాత్రం రిలాక్స్ అవుతున్నారు. ఇక మరోవైపు కొందరు మాత్రం ఇలా ప్రోమోలతో చీట్ చేయోద్దని, ఆ వీడియో చూసి ఎంతో బాధపడ్డామంటూ కామెంట్స్ చేస్తున్నారు. Photo : Instagram
ఇక మరోవైపు సుమ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. టీవీ మెగాస్టార్‌గా పిలవబడుతోన్న సుమ గత కొన్ని సంవత్సరాలుగా ఒక అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. తను యూట్యూబ్ ఛానల్లో ఆ వ్యాధి గురించి మాట్లాడుతూ.. తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నట్లు సుమ తెలిపారు. Photo Twitter
ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలు ఎన్నో భాదలు, కష్టాలు పడినట్లు చెప్పారు. ఈ వ్యాధి వల్ల మేకప్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బందులు పడాల్సి వస్తుందని బాధపడ్డారు. తన కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటి విషయాలు సరిగ్గా తెలియక తన చర్మానికి ఈ డ్యామేజ్ జరిగిపోయిందని, తర్వాత అది తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా.. ఫలితం రాలేదని తెలిపారు. కీలాయిడ్ టెండెన్సీ అంటే చర్మంపై ఒక చోట గాయం అయితే ఆ గాయం రోజు రోజుకు పెద్దదిగా మారి చుట్టుపక్కల అంతా వ్యాపించి మరింత పెద్ద గాయం అయ్యే అవకాశం ఉంటుందట. Photo : Instagram
ఇక సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ అంటూ వచ్చిన ఈ సినిమా కోసం సుమ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్లో చేశారు. అయినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ సినిమా ఏమాత్రం ఆదరణకు నోచుకోలేదు. దాంతో సుమ పూర్తిగా డీలా పడిపోయి, మళ్లీ మరోసారి సినిమాలు చేసే ఆలోచన కూడా వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు తనకు అచ్చిరావని భావిస్తున్నారట సుమ. Photo : Twitter
యాంకర్ సుమ (Anchor Suma) అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ (Suma Kanakala) తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే సుమ ఒక్క షోకు ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలనీ చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సుమ తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా రూ. 2-2.5 లక్షలు వసూలు చేస్తుంటారని టాక్. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ యాంకర్లలో ఒకరిగా పేరుపొందిన ఈ 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు. Photo : Instagram
దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ సమీప భవిష్యత్తులో ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ (Suma Kanakala) స్పెషాలిటీ. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. Photo : Twitter