కొన్ని దశాబ్దాల కిందట తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఒక తెల్లటి గుడ్డ, ప్రొజెక్టర్ సహాయంతో సినిమాలు వేసే వారు. గ్రామ ప్రజలు అందరూ వచ్చి అక్కడ ఆ సినిమా చూసి సంతోష పడేవారు. కొందరు తమ కుర్చీలను తామే తెచ్చుకొని అక్కడ వేసుకొని చూసే వారు.ఇన్ని దశాబ్దాల తరువాత మళ్ళీ 'బలగం' సినిమా ఆ పాత రోజులని గుర్తు చేసింది. అదెలాగంటే?
ప్రస్తుతం అనేక సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలే ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటాయి. అలాంటి సినిమాల్లో బలగం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఈ సినిమాను కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో బూర్గుపల్లి, ఉప్పర మల్యాలలో పాత రోజుల్లోలాగా ప్రదర్శించారు. ఆ గ్రామంలో ఉండే వాళ్ళు, ముఖ్యంగా థియేటర్ కి రాలేని పెద్దవాళ్ళు వచ్చి ఆ సినిమా చూసారు. ఇలా బలగం సినిమా పాత రోజులను మళ్లీ గుర్తు చేసిందని వారు మాట్లాడుకుంటున్నారు.