మెయిన్ హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తుండగా.. మూడో హీరోయిన్ గా రిధి కుమార్‌ను ఫైనల్ చేశారు. ‘లవర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన రిధి కుమార్.. గతంలో ‘రాధే శ్యామ్’ సినిమాలో నటించింది. తాను ప్రభాస్‌కి గొప్ప అభిమానిని అని, ఆయన అట్యిట్యూడ్ ఏంటో.. పర్సనల్ ఆయనేంటో తనకు బాగా తెలుసని చెప్పిన డైరెక్టర్ మారుతి.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ గా ఉండేలా రూపొందిస్తున్నట్లు చెప్పారు.