అది అలా ఉంటే యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పుష్ప, ఖిలాడి వంటి సినిమాల్లో నటించిన ఈ భామకు తాజాగా ఓ అదిరిపోయే పాత్ర వచ్చిందని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అనసూయకు ఓ ఖతర్నాక్ రోల్లో నటించే అవకాశం వచ్చిందట. అంతేకాదు అనసూయను ఓ సీన్లో చిరంజీవి బెదిరిస్తారట. . Photo : Instagram
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్లో అనసూయ కూడా నటిస్తోందట. ఈ సినిమాలో అనసూయ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు టాక్. అందులో భాగంగానే తనను ఎంతో నమ్మిన చిరంజీవికి వెన్నుపోటు పొడిచి జైలుకు వెళ్లేలా చేస్తుందట. ఈ సినిమాలో ఆమెది కీలకపాత్ర అని అంటున్నారు. అక్కడే చిరంజీవి అనసూయకు వార్నింగ్ ఇస్తారని తెలుస్తోంది. ఈ సినిమా మలయాళీ సినిమా లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. Photo : Instagram
ఈ సినిమాతో పాటు అనసూయకు మరో సినిమా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె 'ఎయిర్ హోస్టెస్'గా కనిపించనుందని అంటున్నారు. గతంలో 'పేపర్ బాయ్' సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయను లీడ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందట. Photo : Instagram
ఈ సినిమాలతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా అనసూయ కనిపించనుంది. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. Photo : Instagram
ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని (Anchor Anasuya) తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. ఈ సినిమాతో పాటు అనసూయ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తోంది. Photo : Instagram
ఇక అనసూయ నటించిన ఖిలాడి విషయానికి వస్తే.. మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) లాస్ట్ ఇయర్ 2021లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయనకు కొత్త ఊపిరిని ఇచ్చింది.Photo : Instagram
క ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో (Ravi Teja) ‘ఖిలాడి’ (Khiladi) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.Photo : Instagram
ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. రవితేజ మూడు నాలుగు చిత్రాలను లైన్లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే.. Photo : Instagram
ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.. Photo : Instagram
దాంతో పాటు రవితేజ కెరీర్లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. వీటితో పాటు రవితేజ.. ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo : Instagram