మంచి అంచనాల నడుమ ఆగస్టు 5న వచ్చిన ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 4 కోట్లు, సీడెడ్ - 1.5 కోట్లు, ఆంధ్రా - 6 కోట్లు మొత్తంగా 11.50 కోట్లుగా ఉంది. కర్నాటకతో రెస్టా ఆఫ్ ఇండియా - 0.70 కోట్లు, ఓవర్సీస్ - 2.5 కోట్లు. ఇతర భాషలు - 1.50కోట్ల వరకు బిజినెస్ చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు చేయగా.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 17 కోట్లు వసూలు చేయాలి. Photo : Instagram
ఇక ఈ సినిమా థియేటర్స్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 115, సీడెడ్ - 50, ఆంధ్ర - 185. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లో విడుదలవుతోంది. వీటికి తోడు కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 థియేటర్స్, ఇతర భాషలు - 180, ఓవర్సీస్లో 250 పైగా థియేటర్స్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 860+ థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది. Photo : Instagram
ఇక మరోవైపు ప్రిరిలీజ్ ఈవెంట్ సందర్భంగా సీతరామం టీమ్ తమ సినిమా టిక్కెట్ రేట్లను ప్రకటించింది. తమ సినిమాకు అత్యంత తక్కువగా ధరలను నిర్ణయించామని తెలిపింది. ఇక టిక్కెట్ రేట్ల విషయానికి వస్తే.. గరిష్టంగా సింగిల్ స్క్రీన్కు 100, మల్టీఫ్లెక్స్కు 150 ఖరారు చేశారు. ఇక ఈ విషయంలో నెటిజన్స్ సీతారామం టీమ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. మళ్లీ పాతరోజుల వచ్చాయని.. జనాలు తిరిగి సినిమా కోసం థియేటర్స్‌కు వస్తారంటూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. Photo : Instagram
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాగూర్ నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న చేసింది. ఇక ఈ సినిమాతో సుమంత్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈయన భార్యగా భూమిక నటిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సైనికుడి పాత్రలో ఆకట్టుకున్నారు. కశ్మీర్ విజువల్స్, ఫోటోగ్రఫీ బాగున్నాయి. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అందంగా మార్చేశాయి. Photo : Instagram
ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ 2014లో విడుదలైన మరాఠీ చిత్రం, విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో, ఠాకూర్ అంతర్జాతీయ చిత్రం లవ్ సోనియాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించారు. ఇక హిందీలో ఆమె 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ సూపర్ 30 నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. Photo : Instagram