గురువారం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. సినిమా బడ్జెట్, టికెట్ల రేట్లు, అదనపు షోల మినహాయింపు గురించి మాట్లాడారు. తమ సినిమా ట్రిపుల్ ఆర్ టికెట్ ధర పెంపునకు అనుమతి కోరుతూ దర్శకుడు రాజమౌళి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్లు, జీఎస్టీ కాకుండా సినిమాకు రూ.336 కోట్లు ఖర్చైందంటూ, వాటికి సంబంధించిన వివరాలను ఆయన అందజేసినట్లు వెల్లడించారు. (File)
సినిమా హీరోలు, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యూనిరేషన్లు కాకుండా రూ.336 కోట్ల బడ్జెట్ అయితే.. రెమ్యూనరేషన్లతో కలిపి దాదాపు రూ.500 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు రామ్ చరణ్, తారక్ దాదాపు మూడేళ్లు పనిచేశారు. దీంతో ఇద్దరికి కలిపి దాదాపు వంద కోట్లు ఉండే అవకాశముంది. (Twitter/Photo)