Bollywood: మన బాలీవుడ్ తారలు Instagram లో పెట్టే ఒక్కో పోస్టుకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..?
Bollywood: మన బాలీవుడ్ తారలు Instagram లో పెట్టే ఒక్కో పోస్టుకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..?
Bollywood: సినిమా తారలు, క్రికెట్ వీరులంటే మన దేశంలో వల్లమాలిన అభిమానం. ఈ సెలబ్రిటీలలో చాలా మందికి గుడి కట్టే అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఈ తారలకు అభిమానులందరినీ విడివిడిగా కలుసుకోవడం సాధ్యపడదు. అందుకు ఉన్న ఒకే ఒక వేదిక. సామాజిక మాధ్యమాలు. ఇందుకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం వంటివి వారికి ఉపయోగపడుతున్నాయి.
మన స్టార్స్ సోషల్ మీడియా లో పెట్టే ప్రతి పోస్ట్ ఊరికే చేస్తున్నారంటే పొరపాటే. సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులకు కోట్లలో సంపాదన ఉంటుందన్న సంగతి తెలుసా..?
2/ 8
సోషల్ మీడియా సైట్స్ లో ఇన్స్టాగ్రాం ఒక సంచలనం. ఫోటో షేరింగ్ యాప్ అయినా.. ఇందులో చాలా ఫీచర్లున్నాయి. అయితే ఈ యాప్ ద్వారా మన స్టార్స్ ఎంత సంపాదిస్తారో ఇక్కడ చూద్దాం.
3/ 8
బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇన్స్టాగ్రాంలో చురుకుగా ఉంటారు. ఆమె సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ ఇందులోనే చేపడతారు.
4/ 8
Instagram లో 40 మిలియన్ల (4 కోట్ల) మంది ఫాలోవర్లున్న ప్రియాంక.. ఇన్స్టాగ్రాంలో పెట్టే ఒక్కో పోస్టుకు రూ. 1.87 కోట్లు వెనకేసుకుంటున్నది. (image : pycker)
5/ 8
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు ఒక్క ఫోటో అప్లోడ్ చేస్తే రూ. 50 లక్షల దాకా ముట్టజెప్పుతుంది ఇన్స్టాగ్రాం.
6/ 8
అలియా భట్ కు ఒక్క పోస్టుకు రూ. 1 కోటి దాకా దక్కుతాయి.
7/ 8
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇన్స్టాగ్రాంలో పెట్టే ఒక్క పోస్టుకు రూ. 1 కోటి దాకా ఆదాయం వస్తుంది.
8/ 8
షాహిద్ కపూర్ కు ఒక్కో పోస్టుకు రూ. 30 లక్షల ఆదాయం వస్తుంది.