ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన ‘మృగరాజు’, సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన ‘డాడీ’ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో అప్పటికే ఫ్యాక్షన్ చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బి.గోపాల్ దర్శకత్వంలో ‘ఇంద్ర’ సినిమాను చేసిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. (Twitter/Photo)
భారీ క్యాస్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అప్పట్లో రూ. 10 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 29 కోట్ల షేర్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో కేవలం చిరంజీవి పారితోషకం రూ. 7 .5కోట్లు తీసుకోవడం విశేషం. మిగిలిన బడ్జెట్లో మిగతా ఆర్టిస్టుల పారితోషకం గట్రా అన్ని ఉన్నాయి. (Twitter/Photo)
చిరంజీవి, దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం మెకానిక్ అల్లుడు. ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్గా నటించింది. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావుతో చిరంజీవి నటించిన ఏకైక చిత్రం ‘మెకానిక్ అల్లుడు’. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)