Pics: సేఫ్ గేమ్ ఆడుతున్న సినీ ఇండస్ట్రీ..సీక్వెల్స్‌కు జై కొడుతున్న హీరోలు
Pics: సేఫ్ గేమ్ ఆడుతున్న సినీ ఇండస్ట్రీ..సీక్వెల్స్‌కు జై కొడుతున్న హీరోలు
Indian Film Industries Playing Safe Game With Sequels | గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలతో కుస్తీ పట్టడం కంటే పాత కథలనే అటూ ఇటూ తిప్పి సీక్వెల్స్‌గా చుట్టేస్తున్నారు. అందులో కొన్ని సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కితే..మరికొన్ని వేరే స్టోరీలతో సీక్వెల్స్‌గా ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఇంతకీ ఎవరెవరు ఏయే సీక్వెల్స్‌తో ఆడియన్స్ ముందుకొస్తున్నారో మీరు కూడా ఒక లుక్కేండి.
ఈ సంక్రాంతి రేసులో ముందుగా బరిలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మంచి టాక్ తెచ్చుకుంది. ఇపుడు అదే ఊపులో ఫిబ్రవరి 7న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘KGF’ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) మూవీ కూడా రెండు భాగాలుగా రానుంది. ఆల్రెడీ రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది.