Independence Day 2021: బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ..

Independence Day 2021 - NBK | నందమూరి నట సింహం బాలకృష్ణ దేశ ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన బసవ తారకం కాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేసారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలతో నలిగిపోయిన భారతావనిని కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకున్నారు.