ఎక్స్ ట్రా జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్ ట్రా జబర్దస్త్ తెలుగు బుల్లితెర మీదనే టాప్ కామెడీ షో. ముందుగా జబర్దస్త్ మొదలు కాగా.. తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండో షోలు కూడా ఒకే ప్లాట్ ఫాం కిందకు వస్తాయి. (Youtube/Credit)
ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనో ఇలా అంటాడు.. ‘ఎంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు.. ఏంటిది.. పద్దతేనా అస్సలు.. ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి అంటూ అతడిపై విరుచుకుపడతాడు. ఐ యామ్ సో సారీ అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు మనో. (Youtube/Credit)
మనో గారు అంటూ రోజా అంటున్నా.. అతడు వినకుండా ఆ చైర్ పై నుంచి దిగి వెళ్లిపోతాడు. మనో వెళ్లకుండా అడ్డుకున్న రాకేష్ టీం సభ్యులను.. పైకి వెళ్లండి అంటూ కోపంతో చెబుతాడు మనో. ఐ యామ్ స్వారీ సార్ అంటూ రాకేష్ అంటున్నా.. చేయితో కొట్టబోతాడు మనో. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. (Youtube/Credit)