IMDb 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించారు. ఇందులో తెలుగుకు సంబంధించిన ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, సమంత నలుగురు ఉండటం విశేషం.ఈ జాబితాలో గ్లోబల్ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush) IMDb జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల అగ్రస్థానంలో ఉండగా, ఆలియా భట్ (Alia Bhatt) ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. (Twitter/Photo)
2022 IMDB 1 | ఈ లిస్టులో తమిళ నటుడు ధనుశ్ అగ్ర స్థానంలో నిలిచారు. ముఖ్యంగా తమిళంలో పాటు తెలుగు, బాలీవుడ్ చిత్రాలతో పాటు తాజాగా హలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ది గ్రే మ్యాన్ మరియు తిరుచిత్రంబలం వంటి బహుభాషా చిత్రాల విజయవంతమైన విడుదలలతో అభిమానుల ఆసక్తిని పెంచి ధనుష్ ఈ సంవత్సరంలో అగ్రస్థానం పొందారు.అందుకే ఈ లిస్టులో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచారు. (Twitter/Photo)
2022 IMDB 2 | ఆలియా భట్ ఈ యేడాది ఆర్ఆర్ఆర్, గుంగుబాయ్ కఠియావాడి సినిమాలతో పాటు రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లి వంటి విషయాలతో వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఈ యేడాదే ఈమె ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఒక రకంగా 2022 ఆలియా భట్‌కు లక్కీ ఇయర్ అని చెప్పాలి. అందుకే IMDB లిస్ట్‌లో 2వ స్థానంలో నిలిచింది. (twitter/Photo)
2022 IMDB 5 | సమంత ఈ యేడాది యశోద వంటి సినిమాప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల మిలియన్ల IMDb కస్టమర్ల పేజీ వీక్షణల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందించారు. IMDb యొక్క 200 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా నిర్ణయిస్తుంది. గతేడాది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో పాటు తనకు సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలిచి.. IMDB లిస్టులో 5వ స్థానంలో నిలిచింది.