బ్యూటీ ఇలియానా..‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఇలియానా తన నడుమందాలతో తెలుగు యూత్‌కు నిద్ర లేకుండా చేసింది. దేవదాసు మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’లో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది. Ileana Photo : Instagram
ఆ సినిమా ఇచ్చిన ఊపుతో తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది ఇలియానా. ఓ పక్క ఇటు తెలుగులో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా అదరగొట్టింది. అందులో భాగంగా ఈ భామ అక్కడ 'బర్ఫీ', 'పటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్లు అందుకుంది. Photo : Instagram
అయితే పీక్స్ ఉన్నపుడే బాలీవుడ్‌కు వెళ్లి ఎటూ కాకుండా పోయింది ఈ భామ. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ఒకప్పుడు వరస విజయాలు అందుకున్న ఇలియానా.. ఆ తర్వాత ఫ్లాపులు కూడా అదే స్థాయిలో ఇచ్చింది. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా బికినీతో అందాలను మాత్రం ఎప్పుడూ అలాగే ఆరబోసింది ఇలియానా.
టాలీవుడ్లో తొలి కోటి రూపాయలు అందుకున్న హీరోయిన్గా చరిత్ర సృష్టించింది ఇలియానా. తరుణ్ హీరోగా వచ్చిన భలే దొంగలు సినిమా కోసం భారీగానే రెమ్యునరేషన్ అందుకుంది ఇలియానా. జల్సా, కిక్, జులాయి లాంటి విజయాలతో తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే బాలీవుడ్‌కు బర్ఫీ అంటూ వెళ్లిపోయింది. (Instagram/Photo)
ఇక్కడ ఛాన్సులు రావాలంటే కచ్చితంగా పడుకోవాల్సిందే అంటూ సంచలనాలు రేపింది. మరీ ముఖ్యంగా కొత్త హీరోయిన్లు ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వస్తుంటారని.. కానీ వాళ్లకు ఛాన్సులు రావాలంటే మాత్రం దర్శక నిర్మాతలతో పడుకోవాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఇలియానా వ్యాఖ్యలతోనే అర్థమవుతుంది.
తన విషయంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు జరిగాయని చెప్పుకొచ్చింది. అయితే మనం వ్యవహరించే తీరును బట్టి తప్పించుకోవాలని చెప్పింది ఇలియానా. తన వరకు వచ్చినపుడు చాలా జాగ్రత్తగా తప్పించుకున్నానని చెప్పింది. కొత్తగా వచ్చే హీరోయిన్లకు కూడా ఇలాంటిది ఇండస్ట్రీలో ఉంటుందని ముందుగానే ఫిక్సైపోయి రావాలని చెప్తుంది ఇల్లీ బేబీ.
కేవలం తెలుగు ఇండస్ట్రీ అని మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీ ఏదైనా కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అంటుంది ఇలియానా. ఇక్కడ అమ్మాయిలకు ఇచ్చే గౌరవం కూడా తక్కువగానే ఉంటుందని.. అవకాశాల కోసం వాళ్లను వాడుకోడానికి చాలా మంది ఉంటారని చెప్పుకొచ్చింది ఇలియానా. అలాంటి వాళ్లతో జాగ్రత్తగానే ఉండాలని చెప్తుంది.
కేవలం కొందరి మూలంగానే ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని.. మరికొందరు టాలెంట్ చూసి కూడా అవకాశాలు ఇస్తారని చెప్పుకొచ్చింది. తన విషయంలో ఇండస్ట్రీకి వస్తున్నపుడు నీకు వక్షోజాలు లేవు.. ఫిజిక్ కూడా లేదు.. నీకు ఎవరు ఇస్తారు అవకాశాలు అంటూ వెక్కిరించారని గుర్తు చేసుకుంది. ఏదేమైనా ఇల్లీ బేబీ మాత్రం క్యాస్టింగ్ కౌచ్ గురించి కుండ బద్ధలు కొట్టేసింది.