IFFI Indian Film Personality of the Year | కేంద్రం ప్రతి యేడాది సినీ రంగంలో తమదైన ప్రతిభ చూపించిన వాళ్లకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇస్తూ వస్తోంది. దీంతో పాటు భారత దేశంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2013 నుంచి ఇస్తూ వస్తోంది. భారతీయ సినిమా 100 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మన దేశంలో సినీ రంగంలో కృషి చేసిన వాళ్లకు ఈ అవార్డు ఇస్తూ వస్తోంది.2013లో 44వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నుంచి ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. తొలి అవార్డును వహీదా రహమాన్ అందుకున్నారు. తాజాగా ఈ 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా చిరంజీవి ఈ అవార్డు అందుకోనున్నారు. (Chiranjeevi Narendra Modi Twitter)
హేమా మాలిని | 52వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో హేమా మాలినికి ఈ అవార్డును అందజేసారు. ఈమె ఈ అవార్డును ప్రముఖ రచయత జాతీయ సెన్సార్ బోర్డ్ చైర్మన్‌తో కలిసి అందుకున్నారు. హేమా మాలిని బాలీవుడ్లో 1970 నుంచి 80 దశకం వరకు బాలీవుడ్లో నెంబర్ వన్ కథానాయికగా సత్తా చూపెట్టారు. ఇప్పటికీ ఆమె అందం అంటే హేమా మాలిని పేరు చెప్పడం కొసమెరుపు. (Photo:Twitter)
ప్రసూన్ జోషి | ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ రచయత ప్రసూన్ జోషి.. బాలీవుడ్లో 50 సినిమాలకు పైగా రచనా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమ సెన్సార్ బోర్డ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాది 52వ చిత్రోత్సవంలో ఈయనకు హేమామాలిని కలిసి ఈ అవార్డును అందుకున్నారు. తొలిసారి ఇద్దరికీ ఈ అవార్డు ఇవ్వడం విశేషం. (Twitter/Photo)
బిశ్వజీత్ ఛటర్జీ | బెంగాలీ మరియు హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా సత్తా చాటిన ఈయన ముఖ్యంగా అప్పట్లో ఈయన క్రైమ్ అండ్ యాక్షన్ సినిమాలతో అప్పటి తరాన్ని ఊర్రూత లూగించారు. ఈయన హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయతగా, రాజకీయ నేతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన 51వఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2020లో అందుకున్నారు. (Twitter/Photo)
సలీమ్ ఖాన్ | సలీమ్ ఖాన్.. హిందీ చలన చిత్ర సీమలో జావెద్ అఖ్తర్‌తో కలిసి సలీం జావెద్గా డాన్, జంజీర్, షోలే, వంటి పలు హిట్ చిత్రాలకు ఈయన కథను అందించారు. కేంద్రం ఈయనను 49వ అంతర్జాతీయ 2018 యేడాది గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. 2019లో కోవిడ్ కారణంగా ఈ అవార్డును ఇవ్వలేదు. (Twitter/Photo)
అమితాబ్ బచ్చన్ | బాలీవుడ్ షెహెన్షాగా హిందీ చలన చిత్ర సీమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకుడిగా సత్తా చాటారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ రోల్స్‌తో ఇప్పటికీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్నారు. ఈయన 2017 యేడాదికి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం (Twitter/Photo)
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ దివంగత గాన గంధర్వుడికి తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళం, హిందీ సహా దేశంలో అన్ని భాషల్లో గాయకుడిగా సత్తా చాటారు. అంతేకాదు నాలుగు భాషల్లో జాతీయ అవార్డు అందుకున్న ఏకైక గాయకుడిగా రికార్డు నెలకొల్పారు. ఈయన 2016లో కేంద్రం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది. (Twitter/Photo)
రజినీకాంత్ | ప్రధాని నరేంద్ర మోదీ, రజినీకాంత్ మంచి మిత్రులు. వీరిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. గతంలో ప్రధాని చెన్నై వచ్చినప్పుడు రజనీ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో చాలా సేపు గడిపారు. ఈయన 2014 యేడాదికి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది. 2019 యేడాదికి గాను రజినీకాంత్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. (Twitter/Photo)
వహీదా రహమాన్ | వహీదా రహమాన్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘రోజులు మారాయి’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన వహీదా రహమాన్.. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన జయసింహా సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన సింహాసనం సినిమాలో ఆయన తల్లి పాత్రలో నటించింది. ఇక హిందీ చలన చిత్ర పరిశ్రమలో తొలి తరం అగ్ర కథానాయికగా సత్తా చాటింది. ఈమెకు కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్‌తో గౌరవించింది. ఇంతటీ లెగసీ ఉన్న ఈమెకు 2013లో తొలి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో కేంద్రం గౌరవించింది.