బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇటీవల చేసిన న్యూడ్ ఫొటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. రణ్ వీర్ సింగ్ వంటి స్టార్ యాక్టర్ న్యూడ్ ఫొటో షూట్ చేయడాన్ని కొందరు సమర్థిస్తుండగా.. మరి కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలో రణ్ వీర్‌కు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
తూర్పు ముంబై సబర్బ్ లో ఉన్న నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (NGO) ఆఫీస్ బేరర్ చెంబూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దరఖాస్తును సమర్పించారు. ఫిర్యాదుదారుడు తన ఫోటోషూట్ తో రణ్ వీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశాడని వారి నిరాడంబరతను అవమానించాడని పేర్కొన్నట్లు అధికారి తెలిపారు. రణ్ వీర్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేశారు.