సుడిగాలి సుధీర్‌ను ఆయన ఫ్రెండ్స్, ఫ్యాన్స్.. ముద్దుగా స్మాల్ స్క్రీన్ పవర్ స్టార్‌గా పిలుచుకుంటారు. అంతేకాదు సుధీర్, రష్మీ జంటకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిని అన్నా, వదినగా భావిస్తారు. వీరిద్దరు కలిశారంటే..ఆ స్కిట్‌కు మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. నిజ జీవితంలోనూ వీరు పెళ్లి చేసుకోవాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుతుంటారు.
జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని సుధీర్ తెలిపారు. నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదని.. కానీ దేవుడు ఏం రాసిపెట్టాడో నాకు తెలియదని..ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. సుధీర్ చేసిన కామెంట్స్‌తో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. తాము సుధీర్, రష్మీ పెళ్లి చూడాలనుకుంటే.. ఈయనేంటి అసలు పెళ్లే చేసుకోనంటున్నాడని ఖంగుతిన్నారు.