Hyper Aadi: ప్రస్తుతం బుల్లితెరలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ షోలు బాగా సందడి చేస్తున్నాయి. షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు కూడా తమ పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. జబర్దస్త్ వంటి షో లాంటివే కాకుండా మరో డాన్స్ షో ఢీ కూడా తమ డాన్స్ పర్ఫామెన్స్ తోనే కాకుండా కామెడీ పరంగా కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది బాగా సందడి చేశారు. అంతేకాకుండా లవ్ లెటర్ లతో ఆకట్టుకున్నారు. ఇక ఓ కంటెస్టెంట్ చేసిన పర్ఫామెన్స్ కి ఫిదా అయిన పూర్ణ వేదిక మీదనే అతనికి కిస్ చేసింది. సుధీర్ కూడా తగ్గేదేలే అంటూనే నవ్వించాడు. చివర్లో హైపర్ ఆది పెన్ను పట్టుకోగా అది షాక్ ఇవ్వడంతో మరింత హైలెట్గా మారింది. ఇక అందులో ఆర్మీ పర్ఫామెన్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ ప్రోమోని చూసిన ప్రేక్షకులు ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.