అయితే ఎప్పుడూ ట్రెండింగ్ టాపిక్స్ ఎంచుకుంటూ స్కిట్స్ చేసే హైపర్ ఆది.. ఈ సారి నరేష్- పవిత్ర లోకేష్ ఇష్యూనే టార్గెట్ చేశాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో నరేష్- పవిత్రల రిలేషన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆది. నరేష్ పవిత్రల పేర్లతో తనదైన స్టైల్ కౌంటర్లు వేశాడు. దీంతో ఈ సీన్ వైరల్‌గా మారింది.
స్కిట్ లో భాగంగా నరేష్‌కు నేనున్నాను అని పవిత్ర అనడంతో వెంటనే సీనియర్ నటుడు నరేష్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మదిలో మెదులుతున్నట్లు సీన్ క్రియేట్ చేశాడు ఆది. ముందుగా ఆది వేసిన పంచ్ ఎవ్వరికీ అర్థం కాలేదు కానీ పంచ్ ప్రసాద్ ఇచ్చిన క్లారిటీతో అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వేశారు. ఈ సీన్ మొత్తం చూసి మొత్తానికి ఆది.. నరేష్ పవిత్రలను కూడా వదల్లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.