Hyper Aadi: జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌కి అవమానం? షాకింగ్ విషయాలు బయటపెట్టిన హైపర్ ఆది
Hyper Aadi: జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌కి అవమానం? షాకింగ్ విషయాలు బయటపెట్టిన హైపర్ ఆది
Sudigali Sudheer: ఇటీవలి కాలంలో బుల్లితెర నెంబర్ వన్ కామెడీ షో జబర్దస్త్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. నాగ బాబు మొదలుకొని ఇప్పటివరకు బయటకొస్తున్న జబర్దస్త్ కమెడియన్ల గురించి ఎన్నో రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది ఓపెన్ అయ్యారు.
ఇదిగో పులి అంటే అదిగో తోక అనేవారు అప్పట్లో ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం అయిపోయింది. సామజిక మాధ్యమాల్లో చిన్న అగ్గిపుల్ల వేస్తే చాలు అది అగ్నిప్రవాహమే అవుతోంది. ఏ చిన్న రూమర్ పుట్టినా అలవోకగా స్ప్రెడ్ అవుతోంది.
2/ 9
ఈ క్రమంలో ఇటీవలి కాలంలో బుల్లితెర నెంబర్ వన్ కామెడీ షో జబర్దస్త్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. నాగ బాబు మొదలుకొని ఇప్పటివరకు బయటకొస్తున్న జబర్దస్త్ కమెడియన్ల గురించి ఎన్నో రూమర్స్ షికారు చేస్తున్నాయి. జబర్దస్త్ యాజమాన్యాన్ని తప్పుబట్టేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు.
3/ 9
దీంతో గత కొన్ని రోజులుగా జబర్దస్త్ కి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి. జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా కమెడియన్లు బయటకు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఫేమస్ కమెడియన్ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వీడటంపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి.
4/ 9
గత కొన్నేళ్లుగా జబర్దస్త్ వేదికపై తనదైన కామెడీతో ఎంటర్టైన్ చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెర రొమాంటిక్ బాయ్‌గా అతనికి మంచి పేరొచ్చింది. రష్మీతో రొమాంటిక్ యాంగిల్ కూడా బాగా వర్కవుట్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుధీర్ జబర్దస్త్ వీడటం చర్చనీయాంశంగా మారింది.
5/ 9
ఇంతలో జబర్దస్త్ మరో కమెడియన్ కిర్రాక్ ఆర్ఫీ చేసిన బహిరంగ వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మల్లెమాల సంస్థ తమను కుక్కలా, కెజియఫ్ లో బానిసల్లా చూశారని, సరైన భోజనం కూడా పెట్టలేదని.. ఇవే జబర్దస్త్ షో మానేయడానికి కారణాలంటూ కిర్రాక్ ఆర్పీ బ్లాస్ట్ అయ్యాడు.
6/ 9
ఈ క్రమంలో సుడిగాలి సుధీర్‌కి కూడా జబర్దస్త్‌లో ఘోర అవమానాలు జరిగాయని, అందుకే సుధీర్ జబర్దస్త్ వదిలి వేరే ఛానల్‌కి వెళ్లాడనే టాక్ షురూ అయింది. ప్రస్తుతం ఎక్కడచూసినా ఇవే చర్చలు నడుస్తున్నాయి.
7/ 9
ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ ఓపెన్ అయ్యారు. మల్లెమాల విషయమై కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్‌లో ఎలాంటి నిజాలు లేవంటూ కుండబద్దలు కొట్టేశారు. అలాగే సుధీర్ విషయమై కూడా స్పందించారు.
8/ 9
సుడిగాలి సుధీర్‌కి జబర్దస్త్‌లో ఎలాంటి అవమానాలు ఎదురుకాలేదని చెప్పారు హైపర్ ఆది. మల్లెమాలతో సుధీర్ కాంట్రాక్టు ఫినిష్ కావడం, అలాగే ఆయన సినిమాలతో బిజీ కావడం మూలాన జబర్దస్త్ వీడాడు తప్ప ఇంకేమీలేదని స్పష్టం చేశారు హైపర్ ఆది.
9/ 9
అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వీడడంపై కిర్రాక్ ఆర్ఫీ అలా ఎందుకు మాట్లాడాడో తనకైతే తెలియదని హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ అన్నారు. మల్లెమాల వారు సుధీర్ ని అవమానించారని అనడం అబద్దమని వారు చెప్పారు.