జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది తెలుగువారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను ఇస్తోంది. మరోవైపు షోలో చేస్తున్న వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అలా జబర్దస్త్ షోకు వచ్చి పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. జబర్దస్త్‌కు ముందు అసలు హైపర్ ఆది ఎవరో తెలియదు. అయితే జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యారు ఆది. చెప్పాలంటే జబర్దస్త్‌లో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఆది స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఆది ఏదైనా స్కిట్ చేసాడంటే చాలు.. వ్యూస్‌తో పాటు కాంట్రవర్సీలకు కూడా కొదవే ఉండదు. Photo : Youtube
ఇక అది అలా ఉంటే జబర్దస్త్ షోలో గత కొన్ని వారాలకు హైపర్ ఆది కనిపించడం లేదు. హైపర్ ఆది జబర్దస్త్ షోలో సుదీర్ఘ కాలంగా కామెడీ చేస్తూ.. ఓ వైపు ఈ షోలో కొనసాగుతూను మరోవైపు తనకు వచ్చిన సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఈ మధ్యలో ఆయన కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా హైపర్ ఆది కనిపించకుండా పోయారు. అయితే అది ఒకటి రెండు వారాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఏకంగా నాలుగు వారాలుగా జబర్దస్త్‌లో హైపర్ ఆది కనిపించడం లేదు. దీంతో ఆయన ఫ్యాన్స్, ఆది కామెడీని ఇష్టపడేవారు హైపర్ ఆది ఎటు వెళ్ళాడ.. ఎక్కడికి వెళ్ళాడో అని ఆరా తీస్తున్నారు. Photo : Twitter
అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు గత కొన్ని వారాలుగా హైపర్ ఆదికి, జబర్ధస్త్‌ను ప్రోడ్యూస్ చేసే ప్రోడక్షన్ హౌజ్ మల్లెమాలకు మధ్య ఏవో తేడాలు, విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. కొన్ని ఆర్థికపరమైన కారణాల వల్ల ఆయన ఆది కొంత దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అందువల్లే హైపర్ ఆది వెళ్లిపోయాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కారణంగానే ఆది శాశ్వతంగా జబర్దస్త్‌కు బైబై చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనికి ముఖ్య కారణం హైపర్ ఆదికి స్టార్ డమ్‌కు తగ్గట్లుగా ఆయనకు రెమ్యూనరేషన్ రావట్లేదని.. ఈ కారణంగానే ఆది జబర్దస్త్‌కు గుబ్ బై చెప్పినట్లు ప్రచారం అవుతోంది. Photo : Youtube
ఇక మరోవైపు ఆది అటు ఢీలో మాత్రం కనిపిస్తున్నారు. దీంతో ఆది ఫ్యాన్స్ మాత్రం మళ్లీ జబర్దస్త్‌లో తమ అభిమాన కమెడీయన్ ఆది రీఎంట్రీ ఇవ్వాలనీ కోరుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. హైపర్ ఆదికి తగిన గుర్తింపు వేరే ఛానల్లో వస్తే అక్కడికి వెళ్లే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. Photo : Youtube
ఇక్కడ గమనించదగిన మరో విషయం ఏమంటే.. దాదాపు గత పదేళ్లుగా జబర్దస్త్‌లో జడ్జిగా కొనసాగిన నటి రోజా జబర్దస్త్‌కు బైబై చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ఎమ్మెల్యే అయ్యాక కూడా జబర్దస్త్‌ని వదల్లేదు. ఆ షోకు మధ్యలో నాగబాబు దూరమైనప్పటికీ రోజా అలానే కొసాగుతూ వచ్చారు. ఇక ఇటీవల ముఖ్యమంత్రి జగన్ చేసిన మంత్రివర్గ విస్తరణలో రోజాకు కూడా మంత్రి పదవి లభించింది. దీనితో రోజా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారు. Photo : Youtube
ఇంతలోనే ఇటు హైపర్ ఆది కూడా జబర్డస్త్ కి శాశ్వతంగా దూరం అవుతున్నాడంటూ ప్రచారం సాగడంతో జబర్దస్త్‌కు గడ్డుకాలమే అంటున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు, అదిరిపోయే పంచ్ లతో జబర్దస్త్‌కు మంచి వ్యూస్‌ను తెచ్చేవని.. ఆదిలోని లోటు రాబోయే రోజుల్లో కనిపిస్తుందని అంటున్నారు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్ కారణంగా ఆయన పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. Photo : Youtube
ఇక ఇటీవల హైపర్ ఆది పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో వచ్చిన భీమ్లా నాయక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. Photo : Twitter
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon)లు నటించారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. Photo : Twitter
ఇక ఆ సినిమాతో పాటు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. Photo : Twitter
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు. Photo : Twitter