గతంలో ఓ సినిమా సన్నివేశంలో భాగంగా హైపర్ ఆది పెళ్లి కొడుకుగా తయారయ్యాడని, ఆయనకు సంబంధించిన పెళ్లి సీన్ షూట్ చేశారని తెలిసింది. సో.. ఇది రియల్ పెళ్లి కాదు.. రీల్ పెళ్లి అని తేలిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో ఈ సీన్ వైరల్ చేస్తూ హైపర్ ఆది పెళ్లి ప్రచారానికి తెరలేపారు కొందరు. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెళ్లి కూతురు సీరియల్ యాక్టర్ అని సమాచారం.