హైపర్ ఆది ఒక్కోసారి అంతే.. తన ముందున్నది ఎవరనేది చూడకుండా, పట్టించుకోకుండా కౌంటర్లు వేసేస్తుంటాడు. అలా ఆది వేసే పంచులు, సెటైర్లు ఒక్కోసారి హద్దులు దాటినట్టుంటాయి. అవి నవ్వుకోవడానికే చేసినా కూడా కొన్ని సార్లు వెగటు పుట్టిస్తాయి.అతిగా అనిపిస్తుంటాయి. ఇక ఆది తన స్టైల్‌ను మాత్రం మార్చుకోవడం లేదు. తన వద్ద ఉండే వారి మీద బాడీ షేమింగ్ కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోతూనే ఉంటాడు.
జబర్దస్త్, ఢీ వంటి షోలకు రైటర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక నటుడిగానూ అదరగొట్టేస్తున్నాడు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోల్లో ఆదికి ఉన్న కమాండ్ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆది కేవలం శ్రీదేవీ డ్రామా కంపెనీలో మాత్రమే చేస్తున్నాడు. ఢీ నుంచి కూడా బయటకు వస్తాడనే టాక్ ఉంది. జబర్దస్త్ నుంచి అయితే గత నెలలోనే వెళ్లిపోయాడు.
శ్రీ వల్లిగా ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణమ్మ.. తగ్గేదేలే అని అంటుంది. దీంతో ఆది అదిరిపోయే కౌంటర్ వేస్తాడు. ఏంటి తగ్గేదేలే.. ఆయాసమా? అని అంటాడు. దీంతో అందరూ గొల్లున నవ్వేస్తారు. ఇక మళ్లీ శ్రీవల్లి అందం గురించి మాట్లాడుతూ.. అన్నపూర్ణమ్మ ఓ డైలాగ్ వేస్తుంది. ఇన్నేళ్లు అయినా కూడా నా అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని అంటుంది. ఆ మాటకు హైపర్ ఆది కౌంటర్ వేస్తాడు. మల్లెమాల ఇచ్చే చెక్కుల కోసం ఇలాంటివి చెబుతారా? అంటూ అన్నపూర్ణమ్మ మీద ఆది కౌంటర్ వేశాడు.