జబర్దస్త్ షోతో పాపులరైన యాంకర్ రష్మి.. ప్రస్తుతం ఆ షోతో పాటు ఈటీవీలో వచ్చే మరో కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షోకి మొదట యాంకర్‌గా వ్యవహరిస్తున్న సుధీర్, స్టార్ మాలో వస్తున్న మరో షోకు వెళ్లిపోవడంతో ఆస్థానంలోకి జబర్దస్త్ యాంకర్ రష్మిను తీసుకువచ్చారు. ఇక్కడ విశేషమేమంటే.. అయితే సుధీర్ లేని లోటును రష్మీ తన అందచందాలతో పాటు క్యూట్ క్యూట్ మాటలతో బాగానే నెట్టుకొస్తోంది. Photo : YouTube
ఇక అది అలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి షోకు సంబంధించిన ప్రోమోని వదిలారు. ఇక ఆ ప్రోమో వీడియోలో ఆషాడం కదా? భార్యభర్తలు ఒక చోట ఉండొద్దని అంటారు రష్మి. ఇక ఆ వెంటనే రష్మీపై అక్క ఆషాడం కదా నువ్ ఇక్కడున్నావ్.. బావ అక్కడున్నాడు అంటూ కౌంటర్ వేసేందుకు ప్రయత్నించగా వెంటనే రష్మీకి స్పందిస్తూ.. ఎవరే నీకు అక్కా.. ఎవరే నీకు అక్కా అని తిరిగి కౌంటర్ ఇస్తుంది. Photo : YouTube
ఇక ఆ తర్వాత హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చి రష్మితో.. అందరికి ఆషాడం నెల నెల రోజులు ఉంటే.. నీకు మాత్రం ఓ ఏడాది ఉండేలా కనిపిస్తోందంటూ పంచ్ వేస్తాడు. అంతేకాదు అత్త అత్త అంటూ అత్తను మీరు కొట్టాలి అంటూ రష్మి, హైపర్ ఆదితో అనగానే.. కళ్లకు గంతలు కట్టుకున్న హైపర్ ఆది ఓ కర్రతో రష్మి మొకాళ్లపై కొడుతుంటాడు. దానికి రష్మి నన్ను ఎందుకు కొడుతున్నావ్ అంటూ అరుస్తుంది. ఇక హైపర్ ఆది మాత్రం తన అత్తను కొడుతున్నట్లు అనుకుంటాడు. Photo : YouTube
అయితే ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ మాత్రం రష్మిని కొట్టడం బాగా లేదని.. తమకు నచ్చలేదని..అంటున్నారు. ముఖ్యంగా రష్మి ఫ్యాన్స్ హైపర్ ఆది చేసిన ఆ పని పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇది టూ మచ్ అంటున్నారు. అయితే ఏది చేసిన స్కిట్ కోసమే.. రేటింగ్ కోసమే కాబట్టి.. అదంతా లైట్ అంటున్నారు మరికొందరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. Photo : YouTube
ఇక రష్మి గౌతమ్ విషయానికి వస్తే.. ఈ జబర్దస్త్ యాంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు. ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు Photo : Instagram
Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. Photo : Instagram
ఇక ఇదే విషయంలో తాజాగా ట్విట్టర్ వేదికగా రష్మి ఆ మధ్య స్పందించారు. బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించారు రష్మి. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు. Photo : Instagram
ఇక రష్మి ఓ వైపు ఈ టీవీలో వచ్చే జబర్దస్త్, ఢీ షోలకు యాంకరింగ్ చేస్తూనే.. నందు హీరోగా వస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే పేరు పెట్టింది చిత్రబృదం. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని ప్రవీణ్ పగడాల నిర్మించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నందుతో పాటు రష్మీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. Photo : Instagram
టీవీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్.. అడపా దడపా సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. గుంటూరు టాకీస్ చిత్రంలో నటించి భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కోన్న రష్మీ.. బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో తానేంటో నిరూపించుకోనుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ చిత్రంలో తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో నందూ పోతురాజు పాత్రలో కనిపించనున్నాడు. Photo : Instagram
రష్మీ నందు లవ్ ఇంట్రెస్ట్‌గా కనబడనుంది. ఈ సినిమాలో నందు పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇక రష్మీ విషయానికి వస్తే.. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోన్న ఈ హాట్ యాంకర్ చాలా రోజుల తర్వాత పెద్ద తెరపై కనిపించనుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి.. ఈ సినిమాలో ఎలా అలరించనుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Photo : Instagram