జబర్దస్త్ షోతో ఎంతో మంది కమెడియన్స్ నవ్వించినా.. హైపర్ ఆది.. వాళ్లందరినీ తలదన్నేలా తనదైన పంచ్ డైలాగులతో జబర్ధస్త్ షోకు తనదైన లెవల్లో నవ్వించాడు. ఇక కొంత మంది ఆడియన్స్ హైపర్ ఆది కోసమే చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక షో ద్వారా ఈయన కూడబెట్టిన ఆస్తుల విలువ కూడా ఓ రేంజ్లో ఉంది. (Photo Twitter)
జబర్దస్త్ తో పాటు, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి షోస్ కూడా చేస్తున్న వీరికి మల్లెమాల వారు మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారట. నెలకు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్‌ను వీడినా.. శ్రీదేవి డ్రామా కంపెనీలో కంటిన్యూ అవుతున్నారు.
హైపర్ ఆది సంపాదన మొత్తంగా చూస్తే ఏడాదికి కోటి దాటిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఈ మధ్య కాలంలోనే హైపర్ ఆది తన ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. ఊర్లో ఆయనకున్న ఆస్తుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఆది చదువుకునేప్పుడే చాలా ఖర్చులు అయ్యాయని, అప్పట్లోనే రూ. 20 లక్షల వరకు అప్పు అయిందని గుర్తు చేసుకున్నాడు.
అభి ద్వారా జబర్దస్త్ షోలో అవకాశం అందుకున్నాడు. స్క్రిప్ట్స్ తో నవ్విస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్నాడు. కానీ గతంలో తమ అప్పులు కట్టడానికి ఉన్న మూడు ఎకరాలు అమ్మేసాడట ఆది వాళ్ల నాన్న. అయితే ఆది జబర్దస్త్‌కు వచ్చిన తర్వాత అదే ఊరిలో మళ్ళీ ఏకంగా 16 ఎకరాలు కొన్నాడట. అంతేకాదు తండ్రి చేతికి పది వేళ్లకు పది ఉంగరాలు కూడా చేయించాడట.