హైపర్ ఆది ప్రేమ పెళ్లి విషయాలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వస్తుంటాయి. హైపర్ ఆది ప్రేమలో ఉన్నాడు..పెళ్లి చేసుకోబోతన్నాడు.. యాంకర్ వర్షిణితో ప్రేమలో ఉన్నాడని ఒకసారి.. బంధవుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతోన్నాడంటూ ఇంకోసారి ఇలా ఎప్పుడూ ఏదో ఒక రూమర్ పుట్టుకొస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆది మాత్రం తన ప్రేమ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పేశాడు.
ఆది ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద పెట్టేశాడు. జబర్దస్త్ షోను ఆది వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం శ్రీదేవీ డ్రామా కంపెనీ మీదే దృష్టి పెట్టేశాడు. ా సుధీర్ వెళ్లిన తరువాత ఆ షో కాస్త కిందకు వచ్చింది. కానీ ఆది మాత్రం దాన్ని పైకి లేపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
ఏరా ఈషా.. ప్రేమ కావాలి వచ్చినప్పటి నుంచి ప్రేమిస్తున్నా.. ఎందుకురా సినిమాలు చేయడం లేదంటూ తన ప్రేమ గురించి చెప్పేశాడు. సినిమా వచ్చి పదకొండేళ్లైంది.. అప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అంటూ ఆది తన ప్రేమ గురించి చెప్పుకొస్తాడు. నాకు అందరిలా ప్రేమ గురించి చెప్పడం రాదు.. ఏడిస్తే చచ్చిపోతా.. చచ్చిపోతే గుంతలో పూడుస్తా అనే డైలాగ్స్ రావు అని రష్మీ సుధీర్ జోడి మీద కౌంటర్లు వేస్తాడు. అర్దరాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేశాడు.. గోడ దూకాడు అనేవి కూడా చెప్పడం రాదంటూ వర్ష ఇమాన్యుయల్ జంట పరువుతీశాడు.