తెలుగు, తమిళం, మలయాళంలో దాదాపు 50 సినిమాలకు పైగానే నటించారు ఈమె. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఆ మధ్య రోజా లేనపుడు కొన్ని రోజుల పాటు జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. మరో జడ్జి రోజా కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడంతో ఇప్పుడు ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు.