నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఓటిటిలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటికీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా గ్రాస్.. 74 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. సంక్రాంతి హాలీడేస్ కూడా అఖండ క్యాష్ చేసుకుంటుంది. ఎన్ని కొత్త సినిమాలు ఉన్నా కూడా ఇప్పటికీ కొన్నిచోట్ల మంచి వసూళ్లు తీసుకొస్తుంది అఖండ. బాలయ్య కెరీర్లో మొదటి 50 కోట్ల షేర్ అందుకున్న సినిమా కూడా ఇదే.
ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించిన సినిమా ఇది. కరోనా తర్వాత వచ్చిన తొలి పెద్ద సినిమా ఇదే. అందుకే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా బాలయ్య సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసారు. ఇది వచ్చిన తర్వాతే పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలకు కూడా మంచి వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు నుంచే సంచలన వసూళ్లు సాధించింది అఖండ.
బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా అఖండ అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. 7 వారాల తర్వాత కూడా కొన్ని చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. 50 రోజుల జర్నీ తర్వాత అఖండ సినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో మురళీకృష్ణ, శివుడు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా అఘోర పాత్రలో అయితే అదిరిపోయాడు.
ఆ పాత్ర బాలయ్య తప్ప ఇంకే హీరో కూడా చేయలేడంటూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య నటనకు ఫిదా అయిపోతున్నారు. లాజిక్స్ లేకపోయినా కూడా మాస్ మ్యాజిక్ ఈ సినిమాలో బాగానే పని చేసింది. సినిమాలో చిన్న చిన్న లోపాలున్నా కూడా కాంబినేషన్ క్రేజ్ సినిమాకు భారీ లాభాలు తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే అఘోరా పాత్రలో బాలయ్యను చూసేందుకు నిజమైన అఘోరాలు థియేటర్స్‌కు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు అఖండ హవా భీభత్సంగా కనిపించింది. పుష్ప వచ్చిన తర్వాత కూడా అఖండ జోరు తగ్గలేదు. ఎక్కడ చూసినా కూడా జన జాతర కనిపిస్తుంది. ఆమధ్య విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఉన్న బంగార్రాజు థియేటర్‌కు నిజమైన అఘోరాలు వచ్చారు.
ఇది చూసి అభిమానులు.. ఇదిరా బాలయ్య అంటే అంటూ మీసాలు మెలేసి.. తొడలు కొట్టేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఆఘోరాల థియేటర్ దర్శనం బాగా వైరల్ అవుతుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత బాలయ్య నుంచి పర్ఫెక్ట్ మాస్ సినిమా పడింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటిటిలో ఎప్పుడు వస్తుందనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. హాట్ స్టార్ డిస్నీ ఈ సినిమా హక్కులు భారీ రేట్ పెట్టి సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్ బెస్ట్ రేట్ ఇచ్చి ఈ చిత్రం హక్కులు తీసుకున్నారు వాళ్లు.
అగ్రిమెంట్ కుదుర్చుకున్నపుడే సినిమా విడుదలైన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు కానీ సినిమాకు థియేటర్స్‌లో వసూళ్లు బాగా వస్తుండటంతో 30 కాస్తా 50 రోజులు అయింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా మరో 10 రోజులు పొడిగించారు. ఈ రోజుల్లో చాలా వరకు సినిమాలకు 30 రోజులు మాత్రమే డెడ్ లైన్ పెడుతున్నారు నిర్మాతలు. అలా చేస్తే వాళ్లకు కూడా ఎక్కువ రేట్ వస్తుంది.
కొన్ని సినిమాలు 20 రోజుల్లోనే వచ్చేస్తున్నాయి. అఖండ మాత్రం 50 రోజుల తర్వాత కానీ ఓటిటిలో విడుదల కావడం లేదు. ఈ సినిమా జనవరి 21 సాయంత్రం 6 గంటలకు విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది హాట్ స్టార్ డిస్నీ. దాంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇన్ని రోజులు థియేటర్స్‌లో మాస్ జాతర జరిగింది. ఇకపై హాట్ స్టార్ డిస్నీలో అఖండ ఆగమనం ఖాయం అయిపోయిందన్నమాట.