నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ హనీ రోజ్ స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. వెండితెరపై ఆమె లుక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన నటనతో వావ్ అనిపించి ఒక్కసారిగా జనం దృష్టిలో పడింది హనీ రోజ్. అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తనకు నటన అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం అని చేవూరిన హానీ రోజ్.. 2005లోనే పరిశ్రమకు వచ్చానని, సినిమాలు తప్ప తనకు మరో పని తెలియదని చెప్పుకొచ్చింది. తాను కేరళ ఫుడ్ బాగా ఇష్టపడతా అని చెప్పిన ఈ బ్యూటీ.. పెళ్లి అనేది ఓ బాధ్యత అంటూ ఓపెన్ అయింది. అందుకే తాను ప్రతి విషయాన్ని ప్రేమిస్తానని, అంత వరకే వెళతానని తెలిపింది.