Honey Rose : మలయాళ నటి హనీ రోజ్.. ఈ యేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తెలుగులో గతంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక వీరసింహారెడ్డి మూవీతో ఒక్కసారి పాపులర్ అయింది. దీంతో ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో మూడు కటింగ్‌లు ఆరు ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుంది.
ప్రాంఛైజీ నిర్వహకులు దినేష్ మాట్లాడతూ నవాబ్ మరియు జైల్ థీమ్ తో ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్ లో ఛెఫ్ లు ప్రత్యేకమైన జూసి మటన్ మండి, అల్ఫాహం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలను అందిస్తున్నామని వివరించారు. టాలీవుడ్ నటుడు ధర్మా, శ్రీని ఇన్ ఫ్రా యం.డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Twitter/Photo)
హానీ రోజ్ విషయానికి వస్తే.. బాలయ్య లేటెస్ట్ సినిమా వీరసింహారెడ్డిలో మీనాక్షి పాత్రలో తన అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. ఈ భామ కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది. హానీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది. Photo : Instagram
హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram

వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. చూడాలి మరి తెలుగులో ఈ భామ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో.. ఇక బాలయ్య వీరసింహారెడ్డి విషయానికి వస్తే.. Photo : Instagram